Sai Pallavi : ఇన్‌డైరెక్ట్‌గా సీనియర్ డైరెక్టర్‌ను సాయి పల్లవి ఛాన్స్ అడుగుతుందా…?
Sai Pallavi : సాయి పల్లవి..సౌత్ సినిమా ఇండస్ట్రీలో నేచురల్ పర్ఫార్మర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. మలయాళ ప్రేమం సినిమా ద్వారా హీరోయిన్‌గా మారిన సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో హీరోయిన్‌గా తెలుగుతెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి, ఆ క్రేజ్‌ను అడ్డుపెట్టుకొని ఎడాపెడా సినిమాలను మాత్రం ఒప్పుకోలేదు. తనకు నచ్చిన, సూటైన కథల్లోనే చేసేందుకు ఎస్ చెబుతూ వస్తోంది. అందుకే, సాయి పల్లవి నుంచి సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి.
అయినా మోస్ట్ వాంటెడ్ బ్యూటీస్ పూజా హెగ్డే, రష్మిక మందన్నలతో దాదాపు సమానంగానే రెమ్యునరేషన్ అందుకుంటోంది. ప్రస్తుతం సాయి పల్లవి నటించిన విరాటపర్వం సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ చాలా బిజీగా ఉంది. సినిమా ఏదైనా సాయి పల్లవినే హైలెట్ అవుతోంది. ఇప్పుడు కూడా పేరుకే రానా ఉన్నాడు గానీ, ప్రచారం మొత్తం సాయి పల్లవి పేరుమీదే సాగుతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా యంగ్ డైరెక్టర్ వేణు ఊడుగుల రూపొందించిన విరాటపర్వం ఈ నెల 17న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయి పల్లవి పలు మీడియా ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తోంది.

Sai Pallavi Chance asks the senior director
Sai Pallavi : లెజండరీ దర్శకుడితో సినిమా అంటే ఆ కోరిక ఎవరికి ఉండదు.
ఈ సందర్భంగా సాయి పల్లవి తన మనసులోని కోరికను బయటపెట్టింది. సాయి పల్లవి ఇప్పటివరకు చేసిన సినిమాలు కమర్షియల్, అలాగే..కథా బలమున్న సినిమాలే. అయితే, తనకు దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు రూపొందించిన భక్తి ప్రధానమైన సినిమాలు అన్నమయ్య, శ్రీరామదాసు వంటి సినిమాలలో అవకాశం వస్తే నటించాలని ఉందట. ఇలాంటి సినిమాలంటే మహా ఇష్టమని చెప్పుకొచ్చిన ఈ ఫిదా బ్యూటీ అవకాశం వస్తే భక్తి ప్రధానమైన సినిమాలలో నటిస్తానని వెల్లడించింది. దాంతో సాయి పల్లవికి రాఘవేంద్ర రావు సినిమాలో నటించాలనే విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా ఇలా చెప్పిందా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి లెజండరీ దర్శకుడితో సినిమా అంటే నటించాలనే కోరిక ఎవరికి ఉండదు.