Sai pallavi : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా మంచి ఫాంలో ఉండి విపరీతమైన క్రేజ్‌తో వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్న హీరోయిన్స్ కొందరు దర్శక, నిర్మాతలకి కొన్ని సందర్భాలలో సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించినప్పుడు సారీ..డేట్స్ లేవు అని చెప్పడం చాలా కామన్. ఇలాంటి సందర్భాలు పెద్ద పెద్ద దర్శక, నిర్మాతలకే ఎదురవుతుంది. అలాంటి సమయంలో ప్రాజెక్ట్‌కి ఆ హీరోయిన్ ఉంటే బిజినెస్ పరంగా, అభిమానుల పరంగా బాగా ప్లస్ అవుతుందనుకుంటే రెండు, మూడు నెలలు ఆగైనా ఆమె డేట్స్ సంపాదించి తనతోనే సినిమా చేయిస్తారు. ఇక కొన్ని సార్లు అందరు కాస్టింగ్ ఫైనలైతే ఒక్క హీరోయిన్ విషయంలో మిగతా ప్లానింగ్ అంతా డిస్టర్బ్ అవుతుందని వేరే అమ్మాయిని తీసుకుంటారు.
ఇలాంటి ఒక సంఘటన శేఖర్ కమ్ములకి ఎదురైందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు సాయి పల్లవి. శేఖర్ కమ్ముల సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాలు కోరుకునే అమ్మాయి సాయి పల్లవి. శేఖర్ కమ్ముల సినిమాలలో హీరోయిన్స్ చాలా డీసెంట్‌గా కనిపిస్తారు. ఓవర్ ఎక్స్‌ఫోజింగ్, టూమచ్ రొమాంటిక్ సీన్స్, స్కిన్ షో, లిప్ లాక్స్ లాంటివి ఉండవు. చాలా వరకు క్లీన్ మూవీనే తీస్తాడు. అందుకే ఆయన సినిమాలకి రిపీటెడ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ.
సాయి పల్లవి కూడా ఇలాంటి సినిమాలనే చేయడానికి ఇష్టపడుతుంది. అయితే ఫిదా సినిమాకి శేఖర్ కమ్ముల..హీరోయిన్‌గా సాయి పల్లవిని అనుకున్నప్పుడు తనని కలిసి కథ చెప్పాడట. కథ విపరీతంగా నచ్చడంతో ఓకే కూడా చెప్పిందట. శేఖర్ కమ్ముల ఇక ప్రాజెక్ట్ వెంటనే మొదలు పెట్టాలనుకున్నాడు. కానీ సాయి పల్లవి 6 నెలలు వరకు డేట్స్ ఇవ్వలేనని షాకిచ్చింది. అందుకు కారణం ఆమె ఫైనల్ ఎగ్జాంస్‌కి ప్రిపేర్ అవుతుండటమే. మీరు వెయిట్ చేయగలిగితే 6 నెలల తర్వాత చేస్తాను. లేదంటే మీ ఇష్టం అని క్లారిటీగా చెప్పిందట. శేఖర్ కమ్ముల ఒకసారి హీరోయిన్‌గా ఓ హీరోయిన్‌ని ఫిక్సైతే ఇక ఆమెనే ఫైనల్. అందుకే 6 నెలలు తర్వాత సాయి పల్లవితో ఫిదా తీశాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.