Sai pallavi : ఇప్పుడైతే డేట్స్ ఇవ్వలేను శేఖర్ కమ్ములకి షాకిచ్చిన సాయి పల్లవి..!

Authored By vamana sai | The Telugu News | Published on: June 21, 2021, 3:35 pm

Sai pallavi : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా మంచి ఫాంలో ఉండి విపరీతమైన క్రేజ్‌తో వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్న హీరోయిన్స్ కొందరు దర్శక, నిర్మాతలకి కొన్ని సందర్భాలలో సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించినప్పుడు సారీ..డేట్స్ లేవు అని చెప్పడం చాలా కామన్. ఇలాంటి సందర్భాలు పెద్ద పెద్ద దర్శక, నిర్మాతలకే ఎదురవుతుంది. అలాంటి సమయంలో ప్రాజెక్ట్‌కి ఆ హీరోయిన్ ఉంటే బిజినెస్ పరంగా, అభిమానుల పరంగా బాగా ప్లస్ అవుతుందనుకుంటే రెండు, మూడు నెలలు ఆగైనా ఆమె డేట్స్ సంపాదించి తనతోనే సినిమా చేయిస్తారు. ఇక కొన్ని సార్లు అందరు కాస్టింగ్ ఫైనలైతే ఒక్క హీరోయిన్ విషయంలో మిగతా ప్లానింగ్ అంతా డిస్టర్బ్ అవుతుందని వేరే అమ్మాయిని తీసుకుంటారు.

Sai Pallavi gave shock to Shekhar Kammula ..!

Sai Pallavi gave shock to Shekhar Kammula ..!

ఇలాంటి ఒక సంఘటన శేఖర్ కమ్ములకి ఎదురైందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు సాయి పల్లవి. శేఖర్ కమ్ముల సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాలు కోరుకునే అమ్మాయి సాయి పల్లవి. శేఖర్ కమ్ముల సినిమాలలో హీరోయిన్స్ చాలా డీసెంట్‌గా కనిపిస్తారు. ఓవర్ ఎక్స్‌ఫోజింగ్, టూమచ్ రొమాంటిక్ సీన్స్, స్కిన్ షో, లిప్ లాక్స్ లాంటివి ఉండవు. చాలా వరకు క్లీన్ మూవీనే తీస్తాడు. అందుకే ఆయన సినిమాలకి రిపీటెడ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ.

Sai pallavi : తర్వాత సాయి పల్లవితో 6 నెలలు ఫిదా తీశాడు.

Sai Pallavi gave shock to Shekhar Kammula ..!

Sai Pallavi gave shock to Shekhar Kammula ..!

సాయి పల్లవి కూడా ఇలాంటి సినిమాలనే చేయడానికి ఇష్టపడుతుంది. అయితే ఫిదా సినిమాకి శేఖర్ కమ్ముల..హీరోయిన్‌గా సాయి పల్లవిని అనుకున్నప్పుడు తనని కలిసి కథ చెప్పాడట. కథ విపరీతంగా నచ్చడంతో ఓకే కూడా చెప్పిందట. శేఖర్ కమ్ముల ఇక ప్రాజెక్ట్ వెంటనే మొదలు పెట్టాలనుకున్నాడు. కానీ సాయి పల్లవి 6 నెలలు వరకు డేట్స్ ఇవ్వలేనని షాకిచ్చింది. అందుకు కారణం ఆమె ఫైనల్ ఎగ్జాంస్‌కి ప్రిపేర్ అవుతుండటమే. మీరు వెయిట్ చేయగలిగితే 6 నెలల తర్వాత చేస్తాను. లేదంటే మీ ఇష్టం అని క్లారిటీగా చెప్పిందట. శేఖర్ కమ్ముల ఒకసారి హీరోయిన్‌గా ఓ హీరోయిన్‌ని ఫిక్సైతే ఇక ఆమెనే ఫైనల్. అందుకే 6 నెలలు తర్వాత సాయి పల్లవితో ఫిదా తీశాడు.

ఇది కూడా చ‌ద‌వండి ==> Adhire Abhi : ఆ ఇద్దరూ లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని.. ఎమోషనల్ అయిన అధిరే అభి?

ఇది కూడా చ‌ద‌వండి ==> Jabardasth Varsha : అవును.. నేను పెళ్లి చేసుకుంటున్నా.. పెళ్లి కొడుకు ఎవ‌రంటే..?

ఇది కూడా చ‌ద‌వండి ==> Sreemukhi : లేటెస్ట్ పిక్స్‌తో సెంటరాఫ్ అట్రాక్షన్ అవుతున్న శ్రీముఖి

ఇది కూడా చ‌ద‌వండి ==> Suman : హీరో సుమన్ క్లిష్ట పరిస్థితుల్లో మనవరాలినిచ్చి పెళ్లి చేసిన టాలీవుడ్ దిగ్గ‌జం ఎవ‌రో తెలుసా..?

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp