Sai pallavi : డైరెక్టర్ ని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సాయి పల్లవి .. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు..!
Sai pallavi : తెలుగు పరిశ్రమ లోకి ‘ ఫిదా ‘ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ సాయి పల్లవి. ఈ సినిమాతో సాయి పల్లవికి ఎటువంటి క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. తొలి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే ఇటీవల సాయి పల్లవి తెలుగు సినిమాలలో కనిపించడం లేదు. దీంతో ఆమె నటనకి గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఏకంగా దండలతో సాయి పల్లవి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఆమెకి పెళ్లి అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలపై అధికారికంగా ఎటువంటి ప్రకటన లేదు. రెండ్రోజులుగా చక్కర్లు కొడుతున్న ఈఫోటోల వెనుక అసలు విషయం ఇప్పుడు తెలిసిపోయింది. సాయిపల్లవి నిజంగా పెళ్లి చేసుకోలేదని అభిమానులు పొరపాటు పడ్డారని వార్తలు వచ్చేసాయి.అసలు ఆ ఫోటోలను తమకు పెళ్లి అయినట్లుగా సాయిపల్లవి విడుదల చేయలేదని కూడా తేలిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో శివ కార్తికేయన్ తో సినిమా చేస్తుంది. తమిళ దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది .
ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు చేశారు. సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన పూజా సమయంలో దిగిన ఫోటోలను కట్ చేసి ఇద్దరూ పెళ్లిచేసుకున్నారనే విధంగా ప్రచారం జరిగింది. వీరిద్దరూ దండలు ధరించి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో అభిమానులు సాయి పల్లవికి నిజంగానే పెళ్ళి అయిపోయింది అని అనుకున్నారు. ఇలా వస్తున్న వార్తలపై విరాటపర్వం దర్శకుడు వేణు కూడా పరోక్షంగా స్పందించారు. అసలు ఫోటోలు ఇవే అని సోషల్ మీడియా ఖాతాలో ఫుల్ ఫోటోలు షేర్ చేశారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు సాయి పల్లవి పెళ్లి నిజం కాదు అని తేలింది.