Sai Pallavi : దొంగ‌లా వెళ్లి మ‌హేష్ బాబుసినిమా చూసి వ‌చ్చిన సాయి ప‌ల్ల‌వి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sai Pallavi : దొంగ‌లా వెళ్లి మ‌హేష్ బాబుసినిమా చూసి వ‌చ్చిన సాయి ప‌ల్ల‌వి

 Authored By sandeep | The Telugu News | Updated on :16 May 2022,7:30 pm

Sai Pallavi : సాయి ప‌ల్ల‌వి అంటే తెలియ‌ని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఫుల్ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌. సాయిపల్లవి 1992 మే 9న తమిళనాడు నీలగిరి జిల్లాలోని కోటగిరిలో జన్మించింది. కొయంబత్తూర్ లోని అవిలా కాన్వెంట్ స్కూల్ లో సాయి పల్లవి విద్యాభ్యాసం సాగింది. చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే ఎంతో ప్రాణం. నాట్యంలో ప్రత్యేక శిక్షణ ఏమీ లేనప్పటికీ, సినిమా పాటలకు అలవోకగా డాన్స్‌లతో ఆకట్టుకుంది. చివరికి జార్జియాలోని టిబిలిసి మెడికల్ యూనివర్సిటీలో డాక్టర్ కోర్సు స్టడీకి బ్రేక్‌ ఇచ్చి మరీ సినిమా రంగంవైపు అడుగులు వేసింది.

2005లో మళయాళం దర్శకుడు ఎ.కె.లోహిత్ దాస్ తాను దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘కస్తూరి మాన్’లో తెరంగేట్రం చేసింది సాయిపల్లవి.2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరైంది. భానుమతి పాత్రలో, తెలంగాణా యాసలో డైలాగులు పలికి తన ప్రతిభను చాటుకుంది. అలాగే కోట్ల రూపాయల విలువ చేసే ఫెయిర్‌ నెస్‌ క్రీము,తదితర వాణిజ్య ప్రకటనలకు నిరాకరించి, మరింతమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక సాయి పల్లవి చివరిగా నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో మెరిసింది. ఇందులో దేవదాసిగా సాయి పల్లవి యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది.

sai pallavi watch mahesh Babu movie

sai pallavi watch mahesh Babu movie

Sai Pallavi : భలే పని చేసిందిగా..!

ఇటీవ‌ల ఈ ముద్దుగుమ్మ సీక్రెట్‌గా సినిమాలు చూస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.సాయి ప‌ల్ల‌వి గ‌తంలో హైదరాబాద్‌ ముసాపేటలోని శ్రీరాములు థియేటర్‌కు డైరెక్టర్‌ రాహుల్‌తో కలిసి థియేటర్‌కు వెళ్లింది. బుర్ఖా ధరించిన ప్రేక్షకుల మధ్య ఉండి సినిమా చూసింది. బుర్ఖా ఉండటంతో ప్రేక్షకులు ఎవరూ గుర్తుపట్టలేదు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఇక తాజాగా స‌ర్కారు వారి పాట సినిమా కోసం ముఖానికి స్కార్ఫ్ క‌వ‌ర్ చేసుకొని వెళ్లి సినిమాచూసి మ‌ళ్లీ సైలెంట్‌గా వ‌చ్చేసింద‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది