SS Rajamouli : ఒక్క విషయంలో మాత్రం ఎన్టీఆర్ ప్రభాస్ సేమ్ టు సేమ్.. దర్శకధీరుడు SS రాజమౌళి కీలక వ్యాఖ్యలు!
SS rajamouli : దర్శకధీరుడు రాజమౌళి సంక్రాంతి కానుకగా మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బాహుబలి బిగినింగ్, బాహుబలి కన్ క్లూజన్ తర్వాత రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ వంటి పాన్ ఇండియా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాన్నారు. జనవరి 7వ తేదిన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఇండియాలో 14 భాషల్లో ఆర్ఆర్ఆర్ విడుదలకు మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. మరోసారి భారీ బడ్జెట్‌తో పాటు భారీ తారాగణం ఈ మూవీలో నటించారు. బాలీవుడ్ యాక్టర్స్ అజయ్ దేవగణ్, స్టార్ హీరోయిన్ అలియాభట్‌తో పాటు తెలుగు టాప్ హీరోస్ ఎన్టీఆర్ అండ్ రాంచరణ్ లీడ్ రోల్స్ చేస్తున్నారు.
వాస్తవానికి ఈ మూవీ ఈ ఏడాది నవంబర్‌లో విడుదల కావాల్సి ఉండగా కొంచెం ఆలస్యంగా సంక్రాంతి బరిలో నిలిచింది.ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్‌లో బిజీబిజీగా గడుపుతోంది. ముంబైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కండలవీరుడు సల్మాన్ ఖాన్ వచ్చి ప్రమోషన్ చేశారు. తాజాగా చైన్నైలో నిర్వహించిన ప్రమోషన్స్‌లో రాజమౌళి మాట్లాడుతూ ఎన్టీఆర్ అండ్ ప్రభాస్ ఒక్క విషయంలో మాత్రం సేమ్ టు సేమ్ అన్నారు. తారక్ అండ్ ప్రభాస్ ఫుడ్ విషయంలో ఒక్కటే అభిరుచిని కలిగి ఉంటారన్నారు. వీరిద్దరూ ఫుడ్ లవర్స్ అన్నారు.
SS rajamouli : ఎన్టీఆర్, ప్రభాస్ అభిరుచులు ఒక్కటే..
తన హీరో ప్రభాస్‌తో సినిమా చేయాలంటే అందరికీ కొత్త అనుభూతి కలుగుతుందన్నారు. తన మంచి భోజన ప్రియుడే కాకుండా తను తినే ఐటమ్స్ అందరితో టేస్ట్ చేయిస్తాడని అన్నారు. ప్రభాస్ ఇంటి నుంచి పెద్ద పెద్ద క్యారియర్లు తెస్తాడన్నారు. మూవీ టీం అందరికీ మంచి ఫుడ్ టేస్ట్ చేయిస్తాడని గుర్తుచేశారు. ప్రభాస్ తినడమే కాదు వంటలు కూడా బాగా చేస్తాడని మెచ్చుకున్నారు. ప్రభాస్ లాగే ఎన్టీఆర్ కూడా మంచి ఫుడ్ లవర్ అని చెప్పుకొచ్చారు. తనకు నచ్చిన ఫుడ్ ఇష్టంగా తింటాడని, ఇతరులతో కూడా తినిపిస్తాడని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదయ్యాక బాహుబలి రికార్డులను బీట్ చేస్తుందని రాజమౌళి ధీమా వ్యక్తం చేశారు.