Saif Ali Khan : అర్ధరాత్రి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి దూరి కత్తితో దాడి.. శరీరంపై ఆరు చోట్ల బలమైన గాయాలు
ప్రధానాంశాలు:
Saif Ali Khan :అర్ధరాత్రి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి దూరి కత్తితో దాడి.. శరీరంపై ఆరు చోట్ల బలమైన గాయాలు
Saif Ali Khan : ప్రస్తుతం బాలీవుడ్ Bollywood తో పాటు టాలీవుడ్‌లోను Tollywood ఓ వార్త ప్రకంపనలు పుట్టిస్తుంది. ముంబైలో mumbai జరిగిన ఈ ఘటన హిందీ సినిమా ఇండస్ట్రీ అంతా ఉలిక్కిపడేలా చేసింది. ఆ వార్త ఏంటంటే ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ Actor Saif Ali Khan మీద దాడి జరగడం.ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో House ఓ గుర్తు తెలియని చొరబడ్డాడు. ఆయనపై కత్తితో దాడి చేశాడు. మూడుసార్లు పొడిచాడు. కత్తిపోట్లకు గురయ్యాడు సైఫ్ అలీ. సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. గాయపడ్డ సైఫ్‌ను హుటాహుటిన ముంబై లీలావతి ఆసుపత్రికి తరలించారు. వివరాలలోకి వెళితే గురువారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో ఘటన జరిగినట్లు తెలిసింది.
Saif Ali Khan ఎలా జరిగింది ?
బాంద్రా వెస్ట్ ప్రాంతంలో గల సద్గురు శరణ్ బిల్డింగ్స్‌లో భార్య కరీనా కపూర్ kareena kapoor , ఇద్దరు పిల్లలు తైమూర్, జేహ్‌తో కలిసి నివసిస్తోన్నారు సైఫ్ అలీ. హై- సెక్యూరిటీ జోన్‌గా ఈ ప్రాంతాన్ని పరిగణిస్తుంటారు.. ఆయన ఇంటికి ప్రైవేట్ భద్రత కూడా ఉంది. అర్ధరాత్రి దాటిన తరువాత గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో బీభత్సం సృష్టించాడు. దోపిడీ కోసం అతను ఇంట్లోకి వచ్చి ఉంటాడని అనుమానిస్తోన్నారు. ఇంటి పనిమనిషులు తొలుత అతన్ని చూశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వారిని కత్తితో బెదిరించాడా ఆగంతకుడు. ఇంట్లో కేకలు, అరుపులు వినిపించడంతో సైఫ్ అలీ ఖాన్ అప్రమత్తం అయ్యారు. పనివాళ్లతో కలిసి ఆ అజ్ఞాతవ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. ఆయనపై కత్తితో దాడి చేశాడు. మూడుసార్లు కత్తితో పొడిచాడు. దీనితో సైఫ్ అలీ అక్కడే రక్తపుమడుగులో పడిపోయారు. ఆయనను హుటాహుటిన లీలావతి ఆసుపత్రికి తరలించారు.
సైఫ్‌ను Saif Ali Khan దొంగ కత్తితో దాడి చేశాడా.. ? లేదా అతడితో ఏమైనా గొడవ జరిగిన సమయంలో సైఫ్ గాయపడ్డాడా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. మేము ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తున్నాము. ముంబై క్రైమ్ బ్రాంచ్ కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది’’ అని సీనియర్ ఐపీఎస్ అధికారి తెలిపారు. కాగా, శరీరంపై మొత్తం ఆరు గాయాలు ఉండగా వాటిలో రెండు లోతుగా ఉన్నాయి. అతని వెన్నెముక దగ్గర బలంగా గాయమైంది. ప్రస్తుతం ఆయనకు న్యూరోసర్జన్ నితిన్ డాంగే, కాస్మెటిక్ సర్జన్ లీనా జైన్, అనస్థటిస్ట్ నిషా గాంధీ చికిత్స అందిస్తున్నారు. సైఫ్‌కు సర్జరీ చేసిన తర్వాతే మరింత సమాచారం అందించగలుగుతాం “అని లీలావతి హాస్పిటల్ సీఈవో నీరజ్ వివరించారు.