Prashanth Neel : రాజమౌళి కంటే దారుణంగా ప్రశాంత్ నీల్..?
Prashanth Neel : ఓ సినిమా మేకింగ్ పరంగా రిలీజ్ వరకూ చెక్కుతూనే ఉండే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. అందుకే, ఆయనను జూనియర్ ఎన్.టి.ఆర్ జక్కన్న అని పేరు పేరు పెట్టారు. మామూలు కమర్షియల్ సినిమాలనే రాజమౌళి ప్రతీ ఫ్రేమూ ఒకటికి నాలుగుసార్లు చూసి చూసి ఫైనల్ షేస్తారు. ఇక షూటింగ్ సమయంలో ఒక్కో షాట్ కోసమే చాలా టేకులు తీస్తుంటారు. ఎన్ని టేకులు తీసిన ఫస్ట్ షాట్ చివరికి ఫైనల్ చేసిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన సన్నిహిత వర్గాలు ఇప్పటికే పలు సందర్భాలలో వెల్లడించాయి. ఇక యమదొంగ లాంటి మైథలాజికల్ సినిమా, బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ సినిమా అంటే..అంతే.
జక్కన్న చెక్కుడుకు ఉలి కూడా పగిలిపోవాల్సిందే. అంతగా ఆయన సినిమాను తయారు చేసేందుకు ఆరాట పడతారు. మేకింగ్ సమయంలో ఎంత డబ్బు ఖర్చు చేసినా ఫైనల్‌గా సినిమా రిలీజయ్యాక మాత్రం నిర్మాతకు కాసుల వర్షమే. అందుకే, రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే నిర్మాతలు, హీరోలు ఎప్పుడూ రెడీనే. ఇప్పుడు అదే కోవలోకి కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ వచ్చి చేరారు. ఆయన సినిమాలన్నీ ఒకే థీమ్ లో సాగుతున్నాయి. కేజీఎఫ్ 1 అండ్ 2 ఇప్పటికే రిలీజై ప్రపంచవ్యాప్తంగా సంచల విజయాలను అందుకున్నాయి. ఆ ప్రభావం ఇప్పుడు సలార్ సినిమాపై భారీగా పడుతోంది. అయితే, ప్రశాంత్ నీల్ ఈ సినిమాను గత ఏడాది ఎప్పుడో పట్టాలెక్కించాడు.
Prashanth Neel : ప్రభాస్ కూడా ఈ విషయంలో కాస్త ఇబ్బందిగానే ఫీలవుతున్నారట.
కానీ, చిత్రీకరణ మాత్రం చాలా ఆలస్యంగా జరుగుతోంది. మధ్యలో కొన్ని నెలలు పూర్తిగా ఆగిపోయింది కూడా. వాస్తవంగా అయితే, ఈ పాటికే షూటింగ్ కంప్లీట్ అయి రిలీజ్ కావాల్సింది. కానీ, తిప్పికొడితే, 40 శాతం కూడా టాకీ పార్ట్ పూర్తి కాలేదు. అసలు షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో కూడా మేకర్స్ నుంచి క్లారిటీ రావడం లేదు. అందుకే, రాజమౌళి కంటే కూడా మేకింగ్ పరంగా చాలా దారుణంగా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ కూడా ఈ విషయంలో కాస్త ఇబ్బందిగానే ఫీలవుతున్నారట. అయితే, కేజీఎఫ్ సిరీస్ సక్సెస్ కారణంగా ప్రశాంత్ నీల్‌పై పూర్తి నమ్మకంతో ఎంత టైం తీసుకుంటారో కానీవ్వండి అని నిర్మాత సపోర్ట్ చేస్తున్నారట.