Samantha : ఎట్టకేలకు రూమర్లపై నోరు విప్పింది.. అన్నింటిపై ఒకే సమాధానం చెప్పిన సమంత!
Samantha ప్రస్తుతం సమంత Samantha వ్యవహారం ఎలా ఉందో అందరికీ తెలిసిందే. నాగ చైతన్యతో విడాకుల వ్యవహారంతో సమంత నిత్యం ట్రెండింగ్‌లో ఉంటోంది. ఎక్కడ చూసినా సమంత వార్తలే కనిపిస్తున్నాయి. బ్రేకప్ జరిగిందని, విడాకులు తీసుకోబోతోన్నారంటూ, భరణం అంత ఇస్తున్నారు.. ఇంత ఇస్తున్నారంటూ రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి. అయితే వీటిపై సమంత గానీ చైతన్య గానీ ఇంత వరకు నేరుగా స్పందించలేదు. అయితే తాజాగా సమంత ఓ క్లారిటీ ఇచ్చింది.
తాజాగా సమంత తన సాకీ యానివర్సరీ సందర్భంగా గాల్లో తేలిపోయింది. సాకి ఇంతటి విజయం సాధించినందుకు సమంత తెగ సంబరపడిపోయింది. సెలెబ్రిటీలందరూ కూడా సాకీ ఇంతటి విజయం సాధించినందుకు కంగ్రాట్స్ తెలిపారు. అయితే ఈ క్రమంలో సమంత తన సాకి ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టింది. వారు అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానాలు చెప్పింది. అందులో భాగంగా బయట వచ్చిన రూమర్లను ఖండించింది.
అవన్నీ కేవలం రూమర్లేనన్న సమంత Samantha
సమంత ముంబైకి షిఫ్ట్ అవుతుందనే రూమర్లు వస్తూనే ఉన్నాయి. అది నిజమేనా? అని సమంతను ఓ నెటిజన్ అడిగాడు. అయితే దీనిపై సమంత స్పందించింది. అది నిజం కాదు.. హైద్రాబాద్‌లోనే ఉంటాను.. అది నా సొంతిళ్లు లాంటిది.. ఆ రూమరే కాదు.. బయట వందల రకాల రూమర్లు వస్తూ ఉన్నాయి.. వాటిలో ఏది నిజం కాదు అని సమంత పరోక్షంగా ఖండించింది. అంటే సమంత నాగ చైతన్య విడాకులు కూడా రూమరేనా? అనే కొత్త అనుమానం నెటిజన్లలో కలుగుతోంది.