అన్నీ చేసేసింది.. ఇలా వెక్కిరిస్తోంది.. సమంత పోస్ట్ వైరల్
సమంత సోషల్ మీడియాలో దూకుడుగా ఉంటుంది. ఎవ్వరినీ లెక్క చేయదు. తనకు అనిపించిందే చేస్తుంది. ఎవ్వరూ ఏమనుకున్నా పట్టించుకోదు. అలా సమంత ఎన్నో సార్లు వివాదాల్లో చిక్కుకుంది. అక్కినేని కోడలు అంటూ తనపై ఆంక్షలు విధించాలని చూసే నెటిజన్లు దారుణంగా జవాబులు ఇస్తుంది. తలెత్తుకోలేని విధంగా అసభ్యకరంగా సైగలు చూపిస్తూ ట్రోలర్స్‌ను ఏకిపారేస్తుంది. సోషల్ మీడియాలో సమంత ఎంత సరదాగా ఉంటుందో.. అంతే వయలెంట్‌గానూ ఉంటుంది.
సమంతపై జరిగిన ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. సినిమా పోస్టర్లపై సమంత చేసిన కామెంట్, బికినీలు ధరించి బీచ్‌లో సమంత చేసిన రచ్చపై అప్పట్లో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. మొన్నీ మధ్య మళ్లీ సమంత ట్రోలింగ్‌కు గురైంది. తన డిజైనర్‌తో కలిసి సమంత అత్యంత చనువుగా ఉండటం, అతడి ఒళ్లో కాలు జాపి అలా హాయిగా రెస్ట్ తీసుకోవడం.. ఐ లవ్యూలు చెప్పుకోవడంతో అక్కినేని ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఇక మళ్లీ సమంతను ట్రోల్ చేయడం మొదలెట్టారు.
ఆ వివాదం అంతా అలా ఓ వైపు జరుగుతూ ఉంటే సమంత మాత్రం ఏమీ పట్టనట్టుగా తన దైనందిన కార్యక్రమాలతో బిజీగా ఉంది. మళ్లీ అదే డిజైనర్ ప్రీతమ్‌తో తిరుగుతోంది. అయితే ఇప్పుడు సమంత ఓ పోస్ట్ చేసింది. ఇందులో పొద్దున్నే సూర్య నమస్కారాలు పూర్తి చేసేశాను.. సద్గుగురు ప్రవచనాలు విన్నానని చెప్పుకొచ్చింది. 108 సూర్య నమస్కారాలు, 3 సద్గురు పాడ్ కాస్ట్‌లు విన్న తరువాత అంటూ అద్దం ముందు నిల్చుని వెక్కిరిస్తున్నట్టు ఓ సెల్ఫీని షేర్ చేసింది. ఐ ఫీల్ గుడ్ అంటూ గాల్లో తేలిపోయింది. మరి సమంత అసలు ఈ ట్రోలింగ్ గురించి పట్టించుకున్నట్టా? లేనట్టా? అన్నది మాత్రం తెలియడం లేదు.