Samantha : సమంత సరసన నటించనున్న స్టార్ క్రికెటర్ ..
Samantha : నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం సౌత్ లేడీ సూపర్ స్టార్ నయతారా లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం కాతువాకుల రెండు కాదల్ అనే చిత్రం చేస్తుండగా, ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటస్తున్నాడు. నయన్ ప్రియుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. లాస్ట్ షెడ్యూల్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఒకప్పటి టిమిండియా ఆటగాడు కీ రోల్ పోషిస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.
టిమిండియా బౌలర్, నటుడు శ్రీశాంత్ ఈ చిత్రంలో నటిస్తున్నట్లు చిత్రం బృందం వెల్లడించింది.ఇప్పటికే శ్రీశాంత్ ఓ మూవీతో హీరోగా పరిచమైన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేదు. ఈ క్రమంలో మరోసారి నటుడిగా నిరూపించుకోవాలని ఎదురు చూస్తున్న శ్రీశాంత్‌కు ఇది మంచి అవకాశమని చెప్పుకోవాలి. దీనితో పాటు శ్రీశాంత్ మరో రెండు సినిమాల్లో నటింస్తున్నట్లు తెలుస్తోంది. సమంతతో కలిసి శ్రీశాంత్ నటిస్తుండగా, ఈ సినిమా ప్రేక్షకులని ఫుల్ ఎంటర్‌టైన్ చేయనుందని అంటున్నారు.

samantha and srishanth in crucial roles
Samantha : క్రికెటర్స్‌తో కేక ..
ఇప్పటికే ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమా నుంచి సమంత, నయనతార, విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్‌లను రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్యారెక్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. అది మరెవరిదో కాదు.. వెటరన్ టీమిండియా క్రికెటర్ ఎస్ శ్రీశాంత్‌ది. కోట్, గాగుల్స్ పెట్టుకుని శ్రీశాంత్ ఉన్నాడు. ఈ సినిమాలో శ్రీశాంత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడట. మహ్మద్ మోబీ అనే పాత్రలో శ్రీ కనిపించనున్నాడని సమాచారం. అంతేకాదు సమంత సరసన టీమిండియా క్రికెటర్ పలు సన్నివేశాల్లో ఆడిపాడనున్నాడని వార్తలు వస్తున్నాయి. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.