Samantha – Vijay Deverakonda : బిగ్ బ్లాస్టింగ్ న్యూస్.. లీక్ అయిన సమంత – విజయ్ దేవరకొండ ఖుషి సినిమా స్టోరీ !
Samantha – Vijay Deverakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ‘ లైగర్ ‘ సినిమా ఫ్లాఫ్ తర్వాత ‘ ఖుషి ‘ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత నటిస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్ఈ సినిమా ఫుల్ లెంత్ రొమాంటిక్ లవ్ స్టోరీ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూట్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ సమంత అనారోగ్య కారణం వలన వెనక్కి వెళ్ళిపోయింది. అంతేకాకుండా సమంత కోలుకున్న తర్వాత హిందీలో సీటాడెల్ వెబ్ సిరీస్ లో నటించేందుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ సినిమా కాస్త వెనక్కి వెళ్ళిపోయింది.
అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్ పునః ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లు గానే ఈ సినిమా నుంచి ఏదో ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ లో విషాదాంతం కాబోతుందని తెలిసింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ‘ ఖుషి ‘ సినిమా క్లైమాక్స్ లో హీరో హీరోయిన్లలో ఒక పాత్ర చనిపోయిందని తెలిసింది.
అంతేకాదు సినిమా మొత్తం ఫ్లాష్ బ్యాక్ స్టోరీ తో నడిపిస్తారు అని అంటున్నారు. చావు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఉన్నంత కాలం ప్రతి ఒక్కరూ ఖుషిగా బ్రతకాలి అనే సందేశంతో ఈ సినిమాను ముగిస్తారని కూడా సమాచారం. ఖుషి సినిమాలో శాడ్ ఎండింగ్ ఉంటుందని అటు విజయ్ దేవరకొండ అభిమానులు, ఇటు సమంత అభిమానులు కానీ అస్సలు జీర్ణించుకోలేరనే చెప్పాలి. ఇంత క్రిటికల్ పాయింట్ ను దర్శకుడు ఏ విధంగా చూపిస్తాడో, అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.