Samantha : స‌మంత పెళ్లి కూతురాయ‌నే.. ఇలా చూసి ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : స‌మంత పెళ్లి కూతురాయ‌నే.. ఇలా చూసి ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

 Authored By ramu | The Telugu News | Updated on :9 March 2025,8:30 pm

ప్రధానాంశాలు:

  •  Samantha : స‌మంత పెళ్లి కూతురాయ‌నే.. ఇలా చూసి ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

Samantha : టాలీవుడ్ Tollywood స్టార్ హీరోయిన్ స‌మంత విడాకులు, పెళ్లి వార్త‌లతో నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటార‌నే విష‌యం తెలిసిందే. నాగ చైతన్యను లవ్ మ్యారేజ్ చేసుకున్న సమంత, ఆ పెళ్లి బంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేదు. కేవలం నాలుగేళ్లకే అక్కినేని ఫ్యామిలీతో కటీఫ్ చేసుకుంది. ఇంతలో అక్కినేని నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నారు.

Samantha స‌మంత పెళ్లి కూతురాయ‌నే ఇలా చూసి ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

Samantha : స‌మంత పెళ్లి కూతురాయ‌నే.. ఇలా చూసి ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

Samantha పెళ్లి కూతురిగా..

ఇప్పటికీ సింగిల్ గానే ఉంటున్న సమంతపై అందరి దృష్టి పడింది. సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటుందా? అనేది హాట్ టాపిక్ అయింది. ఈ స‌మయంలో స‌మంత లుక్స్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. సమంత తన సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటో షూట్‌ను షేర్ చేసింది.ఈ ఫొటో షూట్‌లో సమంత పెళ్లి కూతురు గెటప్‌లో దర్శనం ఇచ్చింది. ముక్కు పుడక, నుదుటున ఆ ఎర్రటి బొట్టు పెట్టుకుంది.

స‌మంత గెట‌ప్ అచ్చం నార్త్ సైడ్ పెళ్లి కూతురు మాదిరిగా ఉంది. స‌మంత బాపు బొమ్మ‌లా, చాలా అందంగా ఉంద‌ని కామెంట్ చేస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉందనే టాక్ నడుస్తోంది. వీరిద్దరూ సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారని బీ టౌన్ కోడై కూస్తోంది. దీనిపై రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది.ఇటీవలే రాజ్‌తో సమంత క్లోజ్ గా ఉన్న పిక్ వైరల్ కావడంతో ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే టాక్ ముదిరింది

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది