Samantha : సమంత కోర్టు కేసుపై సంచలన తీర్పు
Samantha సమంతకు మొత్తానికి కోర్టులో ఊరట లభించింది. పరువునష్టం దావా కేసులో నేడు తీర్పు వచ్చింది. తన మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు.. తన పరువుకు భంగం కలిగేలా ప్రచారాలు చేశారంటూ సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, డాక్టర్ సీఎల్ వెంకట్రావు మీద సమంత కేసులు వేసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా సమంత కోర్టు కేసు నడుస్తూనే ఉంది. దీనిపై తాజాగా తీర్పు వెలువడింది. సమంతకు అనుగుణంగానే తీర్పు వ్చింది.

Samantha Defamation Case Verdict
యూట్యూబ్ ఛానెల్స్‌తో పాటు సీఎల్ వెంకట్రావు ప్రసారం చేసిన వీడియోల లింకులను వెంటనే తొలగించాలంటూ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్‌నను పాస్ చేసింది. అయితే సమంతపై ఇక ఎలాంటి తప్పుడు వార్తలు రాయోద్దని, ఆమెపై వ్యక్తిగత జీవితం, కుటుంబ వ్యవహారాల జోలికి వెళ్లకూడదని కోర్టు తీర్పు ఇచ్చింది. వ్యక్తిగత జీవితాల్లోకి యూట్యూబ్ ఛానెల్స్ చొరబడకూడదని.. ఇష్టమొచ్చినట్లుగా కంటెంట్ పెట్టకూడదని కోర్టు ఆదేశించింది.
Samantha సమంతకు అనుగుణంగా కోర్టు తీర్పు..

Samantha Defamation Case Verdict
తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దంటూ సమంతను కోర్టు సూచించింది. మొత్తానికి సమంత కేసుతో కొంత మందిలోనైనా భయం కలిగింది. ఇకపై అలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేయడానికి, రాయడానికి, మాట్లాడటానికి కూడా కాస్త ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. కానీ ఇది ఇంకా ఎంత వరకు వెళ్తుందనేది చూడాలి. ఇప్పటికైతే సమంత పరువుకు భంగం కలిగించేలా ఉన్న కంటెంట్‌ను తొలగించేందుకు యూట్యూబ్ చానెళ్లు కూడా తలూపాయి.