Samantha : సమంత ఆ పని అతిగా చేయడం వల్లనే ప్రాణాంతకరమైన వ్యాధి బారిన పడిందా..!
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా అందరు ఆశ్చర్యపోయే విషయాన్ని చెప్పుకొచ్చింది. తనకు కొన్ని నెలల క్రితం మయోసైటిస్ అని పిలిచే ఆటో ఇమ్యూన్ వ్యాధి నిర్ధరణ అయినట్లు సమంత పేర్కొంది. త్వరలోనే ఈ వ్యాధి నుంచి కోలుకుంటానని, ప్రస్తుతం దీనికి చికిత్స తీసుకుంటున్నట్లు సమంత చెప్పారు. ఒక ఫొటోను కూడా ఆమె షేర్ చేశారు. ఆ ఫొటోలో సమంత చేతికి సెలైన్ పైప్‌తో పాటు ప్లాస్టర్ అంటించి ఉన్నాయి. ఆమె ముందు ఒక మైక్ ఉంది. యశోద సినిమాకి సంబంధించి డబ్బింగ్ చెబుతున్నట్టు కనిపిస్తుంది. సమంతకు ఈ ప్రాణాంతకమైన వ్యాధి సోకగానే అందరు అవాక్కయ్యారు. అఖిల్, ఎన్టీఆర్, కృతి సనన్, రాశి ఖన్నా, జాన్వీ కపూర్‌తో పాటు పలువురు ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.
అయితే సమంత ఈ వ్యాధి బారిన పడడానికి కారణం హెవీ వర్కవుట్స్ అని అంటున్నారు. వంద కేజీల వరకు ఆమె బరువులు మోసింది. అంతేకాదు యశోద, వరుణ్ ధావన్ వెబ్ సిరీస్, ఫ్యామిలీ మ్యాన్ 2 కోసం భారీ వర్కవుట్స్ చేసింది. ఇక నాగ చైతన్య విడాకుల తర్వాత డిప్రెషన్‌కి వెళ్లింది. ఇవన్నీ సమంత ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపించి ఉంటాయని అంటున్నారు. ఆటో ఇమ్యూన్ కారణంగా శరీరంలో ఏర్పడే కొన్ని లక్షణాల కలయికను మయోసైటిస్ అని పిలుస్తుంటారు. దీని వల్ల కండరాలు బలహీనంగా మారడమే కాకుండా త్వరగా అలసట రావడం, నొప్పి ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Samantha : గెట్ వెల్ సూన్ సామ్
కండరాలకు వచ్చే ఇన్‌ఫెక్షన్‌నే ‘మయోసైటిస్ అని అంటున్నారు డాక్టర్లు. అయితే ఈ వ్యాధి రకరకాలుగా ఉంటుంది. అందులో సమంతకు వచ్చిన వ్యాధి ఏ రకమో ఆమె తెలుపలేదు. మనలోని రోగ నిరోధక వ్యవస్థ ఒక్కోసారి పొరపాటున ఆరోగ్యకర కణజాలంపై దాడి చేయడాన్ని వైద్య పరిభాషలో ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు. సాధారణంగా 5-15, 45-60 ఏళ్ల వయస్కులు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. సమంత యంగ్ ఏజ్ లోనే ఉంది కాబట్టి.. జాగ్రత్తలు తీసుకుంటూ.. మెడిసిన్ వాడితే త్వరగా కోలుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్నే ఆమె కూడా వెల్లడించారు. నేను చాలా వరకూ కోలుకున్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టడంతో అభిమానులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు.