పొగడ్త కూడా కొంపముంచింది.. సమంత మీద వాళ్ళకి ఇంకా కాలిపోతుందట ..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

పొగడ్త కూడా కొంపముంచింది.. సమంత మీద వాళ్ళకి ఇంకా కాలిపోతుందట ..?

టాలీవుడ్ లో అక్కినేని సమంత స్టార్ హీరోయిన్. ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య బెటర్ హాఫ్. అక్కినేని కోడలు. అయినా కొన్ని ట్రోల్ బాగా ఇబ్బంది పెడుతున్నాయట. నాగ చైతన్య తో ఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన సమంత ఆ తర్వాత సినిమానే సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేసింది. ఆ సినిమా దూకుడు. బ్లాక్ బస్టర్ అవడంతో టాలీవుడ్ లో స్టార్ గా సెటిలైపోయింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు […]

 Authored By govind | The Telugu News | Updated on :10 December 2020,5:14 pm

టాలీవుడ్ లో అక్కినేని సమంత స్టార్ హీరోయిన్. ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య బెటర్ హాఫ్. అక్కినేని కోడలు. అయినా కొన్ని ట్రోల్ బాగా ఇబ్బంది పెడుతున్నాయట. నాగ చైతన్య తో ఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన సమంత ఆ తర్వాత సినిమానే సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేసింది. ఆ సినిమా దూకుడు. బ్లాక్ బస్టర్ అవడంతో టాలీవుడ్ లో స్టార్ గా సెటిలైపోయింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి భారీ మల్టీస్టారర్ లోనూ మహేష్ తో నటించింది సమంత.

Sarileru Neekevvaru review: A commercial action-entertainer

ఇక అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్య మూర్తి సినిమా చేసింది. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇలా టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి కి జంటగా నటించిన సమంత ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ఇక కోలీవుడ్ స్టార్ హీరోలతో నటించిన సినిమాలు కూడా సమంత అకౌంట్స్ లో హిట్స్ గా చేరాయి. ముఖ్యంగా సూర్య తో 24 లాంటి సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది. ఆ అభిమానంతో రీసెంట్ గా సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాని ఆకాశానికి ఎత్తేసింది. ఈ సినిమా చూసి చాలా ఎమోషనల్ గా కనెక్ట్ సూర్య మీద ప్రశంసల వర్షం కురిపించింది.

Ala Vaikunthapurramuloo review: Allu Arjun shines in this family drama!

అంతేకాదు మూవీ ఆఫ్ ది ఇయర్ అంటూ చెప్పుకొచ్చింది. ఇదే సమంత ని ఇబ్బందుల్లో పెట్టేసింది. ఈ ఇయర్ ప్రారంభంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని బ్లాక్ బస్టర్ కా బాప్ అని అభిమానులు చెప్పుకునే వసూళ్ళు సాధించింది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో 2020 లో టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచింది.

Aakasam Nee Haddura Review | Aakasam Nee Haddura Telugu Review

అయితే ఒకవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్.. ఒకవైపు మహేష్ ఫ్యాన్స్… ఈ విషయంలో రియాక్ట్ అవుతూ మన తెలుగు సినిమాలు కనిపించడం లేదా మీకు అంటూ ఘాటుగా స్పందిస్తూ ట్రోల్ చేస్తున్నారు. చెప్పాలంటే సమంత సూర్య సినిమాని పొగిడేసి వారం … పదిరోజులు అవుతున్నా ఇంకా సమంత మీద బన్ని అండ్ మహేష్ ఫ్యాన్స్ గరం గరం గానే ఉన్నారట.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది