Samantha : బుద్ది ఉందా అంటూ సమంతను తిట్టిపోస్తున్న ఫ్యాన్స్‌.. రోగం కుదరగానే ఇలాగేనా చేసేది! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : బుద్ది ఉందా అంటూ సమంతను తిట్టిపోస్తున్న ఫ్యాన్స్‌.. రోగం కుదరగానే ఇలాగేనా చేసేది!

 Authored By prabhas | The Telugu News | Updated on :15 February 2023,9:00 am

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆమె ఇటీవలే కాస్త ఆరోగ్యం కుదుటపడి బయట కనిపిస్తోంది. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమంత మొక్కు తీర్చుకోవడం కోసం అని పళని మురుగన్ ఆలయంలో ఏకంగా ఏట వాలుగా ఉండే 600 మెట్ల పై కర్పూరం వెలిగించి. అన్ని మెట్లను ఈజీగా ఎక్కేసి అందరిని ఆశ్చర్య పరిచింది. ఆ మధ్య కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడ్డ సమంత ఏకంగా 600 మెట్లపై చాలా ఓపికగా కర్పూర హారతి వెలిగించడం చూస్తూ ఉంటే ఆమె ఆరోగ్యం పూర్తిగా పడిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Samantha fans angry on her about health

Samantha fans angry on her about health

ఇదే సమయం లో ఆమె అభిమానులు కొందరు నిన్న మొన్నటి వరకు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న సమంత ఇప్పటికిప్పుడు ఇంత మొక్కు తీర్చుకోవడం కోసం ఆరు వందల ఏటవాలు మెట్లను ఎక్కడం అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఆరోగ్యం బాగుపడే వరకు వేచి ఉండాలి కదా, కనీసం సంవత్సరం పాటు అయినా పూర్తి విశ్రాంతి అవసరం కదా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. రోగం కుదరగానే ఇలా చేస్తే ఆ రోగం మళ్ళీ తిరగబెట్టదా అంటూ కొందరు సమంత అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Samantha fans angry on her about health

Samantha fans angry on her about health

ఇప్పటికే అనారోగ్య సమస్యల వల్ల చాలా సినిమాలు మిస్ అయినా సమంత ఇప్పుడు ఆరోగ్యం బాగు పడడంతో షూటింగ్స్ కి హాజరు అవ్వాలసి ఉంది. ఇలాంటి మెట్ల పూజలు కర్పూర హారతి అంటూ టఫ్ టాస్క్ చేస్తే కచ్చితంగా అనారోగ్యం బారిన పడాల్సి ఉంటుంది. కనుక ఒళ్ళు కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉండాలని సమంతకు అభిమానులు విజ్ఞప్తి చేస్తూ స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇక సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరో వైపు హిందీలో సమంత నటించిన వెబ్‌ సిరీస్‌ విడుదల అవ్వబోతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది