Naga Chaitanya : అర్ధరాత్రి నాగ చైతన్య ఇంట్లో ఆ హీరోయిన్‌కి ఏం పని.. సమాధానం చెప్పాలంటున్న సమంత ఫ్యాన్స్
Naga Chaitanya : సమంత – నాగ చైతన్య విడిపోయి ఏడాది కావొస్తున్నా కూడా ఇప్పటికీ వీరిద్దరికి సంబంధించి అనేక వార్తలు హల్‌చల్ చేస్తూనే ఉంటాయి. గత ఏడాది కరోనా సమయంలో సమంత, నాగ చైతన్య మధ్యలో గొడవలు మొదలయ్యాయని తెలుస్తోంది. అక్కినేని ఫ్యామిలీ సమంతకు చెప్పడానికి చాలా విధాలుగా ప్రయత్నించినా కూడా.. ఆమె వినడానికి సిద్ధంగా లేదని.. చివరికి విడాకులు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం ఇస్తుందని ఇరు కుటుంబాలు నమ్మారు. దాంతో అక్టోబర్ 2న నాగ చైతన్య సమంత విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు.
విడాకుల తర్వాత పలు విషయాలపై సమంతనే ఎక్కువగా స్పందిస్తుంది. ముఖ్యంగా చైతూ ఇన్‌డైరెక్ట్ పంచ్‌లు కూడా వేస్తుంది . ఇటీవల సమంత నా సహనాన్ని పరీక్షించవద్దు, మౌనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దంటూ ఓ వార్నింగ్ నోట్ పోస్ట్ చేసింది. ఆ ఇండైరెక్ట్ వార్నింగ్ నాగ చైతన్యను లేదా ఆయన ఫ్యాన్స్ ని ఉద్దేశించేనని సోషల్ మీడియాలో టాక్ నడిచింది. చైతన్య సమంత ఎందుకు విడిపోయారనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఇప్పటికీ దొరకడం లేదు. చైతన్య సమంత విడాకుల విషయంలో కొందరు చైతన్యను నిందిస్తుంటే మరి కొందరు మాత్రం సమంతను నిందిస్తుండటం గమనార్హం. కాఫీ విత కరణ్ షో లో..సమంత చేసిన వ్యాఖ్యలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
Naga Chaitanya : ఏం జరిగింది?
మా విడాకులు సామరస్యంగా జరగలేదు అంటూ.. బిగ్ బాంబ్ పేల్చిన సమంత.. నాగ చైతన్య ని తన భర్త అని పిలిపించుకోవడానికి కూడా ఇష్టపడలేదు అంటే పరిస్ధితులు ఎంత దారుణంగా ఉన్నాయనేది స్పష్టంగా మారింది. ఈ నేపథ్యంలో నాగ చైతన్యకు సంబంధించిన ఓ వార్త అందరు ఆశ్చర్యపోయేలా చేస్తుంది. రీసెంట్‌గా చైతూ అపార్ట్ మెంట్ లోకి ఓ హీరోయిన్ అర్ధ రాత్రి వచ్చిందట. ఆ అమ్మాయి మరెవరో కాదు. చైతన్యతో రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఇటీవల వార్తలలో నిలిచిన అమ్మాయి. అర్ధరాత్రి చైతూతో ఉండడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది. దీనిపై సమాధానం చెప్పాలని సమంత ఫ్యాన్స్ మండిపడుతున్నారు.