Samantha : మ‌గాళ్ల‌కి ఏ మాత్రం త‌గ్గ‌కుండా వ‌ర్క‌వుట్స్‌తో కేక పెట్టిస్తున్న సమంత‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : మ‌గాళ్ల‌కి ఏ మాత్రం త‌గ్గ‌కుండా వ‌ర్క‌వుట్స్‌తో కేక పెట్టిస్తున్న సమంత‌

 Authored By sandeep | The Telugu News | Updated on :21 September 2022,6:00 pm

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో స‌మంత ఒకరు అనే సంగ‌తి తెలిసిందే. ఈ అమ్మ‌డు ఎలాంటి స‌పోర్ట్ లేకుండా ఈ స్థాయికి చేరుకుంది.ఇక నాగ చైత‌న్య‌ని వివాహం చేసుకొని అక్కినేని కోడ‌లిగా కూడా మారింది. దీంతో స‌మంత ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం నిల‌వ‌లేదు. కార‌ణ‌మేమో తెలియ‌దు కాని ఇద్ద‌రు విడిపోవ‌డం చాలా బాధించింది. పాన్ ఇండియా రేంజ్‌లో బజ్ చేసే సామ్.. కొంత కాలంగా సైలెంట్ అయింది. ఎందుకో సైలెంట్‌ అయ్యారని తన ఫ్యాన్స్ ఫీలింగ్ .. బయటెక్కడ కనిపించడం లేదేంటి? అనే దానిపైనే అంతా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

Samantha : స‌మంత స్ట‌న్నింగ్ వ‌ర్కవుట్స్..

సామ్‌ ఓ స్కిన్ డిసీజ్‌ తో బాధపడుతున్నారనే టాక్ నెట్టింట వైరల్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. కాస్మోటిక్ పౌడర్స్ అండ్ క్రీమ్స్ కారణంగా.. సమంత చర్మ వ్యాధి బారిన పడ్డారట. అది రోజు రోజుకు మరింతగా ఎక్కువవడంతో.. తాజాగా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి మరీ ట్రీట్మెంట్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. అయితే ఈ త‌ప్పుడు వార్త‌ల‌పై ఆమె మేనేజ‌ర్ క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తలన్నీ అవాస్తవాలేనని చెప్పాడు. సమంత సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపాడు. అయితే సమంత అమెరికాకు ఎందుకు వెళుతుందనే విషయంపై ఆయన స్పందించలేదు.

Samantha Heavy Workouts Equal To men

Samantha Heavy Workouts Equal To men

అయితే స‌మంత ఈ వ‌య‌స్సులో కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇందుకు కార‌ణం నిత్యం జిమ్‌లో వ‌ర్క‌వుట్స్ చేయ‌డం. ప్రతిరోజు కొంత సమయాన్ని జిమ్ కి కేటాయిస్తూ ఉంటుంది. భారీ బ‌రువులు మోస్తూ చెమ‌టు క‌క్కూత స‌మంత చేసే వ‌ర్క‌వుట్స్ అందరికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంటాయి. ఇక ఫుడ్ విష‌యంలోను స‌మంత చాలా కేరింగ్‌గా ఉంటుంది. ప‌చ్చదనం నిండిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతుంది. ప్రతిరోజు గుడ్డు, బట్టర్ వంటివి పరిమితంగా తీసుకుంటుంది.అంతేకాదు త‌న ఫుడ్ విష‌యంలో కొన్ని లిమిటేష‌న్స్ పెట్టుకుంటుంది. ఏదేమైన స‌మంత ఈ వ‌య‌స్సులోను ఇంత స్ట్రాంగ్‌గా ఉండ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

YouTube video

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది