Samantha : దుబాయ్‌లో అవి గుర్తుకు వస్తున్నాయట.. మనసులో మాట చెప్పిన సమంత..!
Samantha : సమంత తన స్నేహితులతో కలిసి ప్రస్తుతం దుబాయ్‌లో చక్కర్లు కొడుతోంది. నిన్న సాయంత్రం దుబాయ్‌కి బయల్దేరిన సమంత.. నేడు ల్యాండ్ అయింది. అక్కడికి వెళ్లగానే షాపింగ్ అంటూ మొదలుపెట్టింది. మొదటగా రెస్టారెంట్ల చుట్టూ తిరిగింది. సమంత వెంట సాధన సింగ్, ప్రీతమ్ జుకాల్కర్ ఉన్నారు. అలా ఈ ముగ్గురు కలిసి దుబాయ్‌లో సందడి చేశారు.
అయితే ఎక్కువగా ఫుడ్ బేస్డ్‌గా ఉన్నట్టు కనిపిస్తోంది. ఎక్కువగా రెస్టారెంట్ల చుట్టూ సమంత తిరుగుతూ కనిపించింది, అక్కడి స్పెషల్ ఫుడ్ ఐటంల గురించి చెప్పింది. మామూలుగా అయితే ఇప్పుడు సెలెబ్రిటీలందరూ కూడా దుబాయ్‌కి చెక్కేశారు. శ్రుతీ హాసన్ అక్కడే ఉంది. వరుణ్ తేజ్, నాగబాబులు కూడా అక్కడేఉన్నారు. అయితే వీరంతా అక్కడికి వెళ్లడానికి ఓ కారణం ఉంది.
Samantha దుబాయ్‌లో సమంత రచ్చ
టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం సమంత అక్కడికి వెళ్లినట్టు కనిపిస్తోంది. అసలే సమంతకు క్రికెట్ అంటే పిచ్చి. మొన్నటి భారత్ పాక్ మ్యాచ్‌ను ఇంటి దగ్గరినుంచి వీక్షించింది. కానీ ఆది వారం జరగబోతోన్న న్యూజిలాండ్ భారత్ మ్యాచ్‌ను వీక్షించేందుకు దుబాయ్‌కి వెళ్లినట్టు తెలుస్తోంది. తాజాగా ఓ కేక్‌ను సమంత తింటూ ఉంటే ఏదో గుర్తుకు వచ్చిందట. వెంటనే నీరజకోనకు సమంత ట్యాగ్ చేసింది.