Samantha : ఆవేశంలో జ‌రిగింది.. ఇప్పుడేం చేయలేం.. విడాకుల‌పై స‌మంత స్ట‌న్నింగ్ కామెంట్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : ఆవేశంలో జ‌రిగింది.. ఇప్పుడేం చేయలేం.. విడాకుల‌పై స‌మంత స్ట‌న్నింగ్ కామెంట్..!

 Authored By ramu | The Telugu News | Updated on :27 July 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Samantha : ఆవేశంలో జ‌రిగింది.. ఇప్పుడేం చేయలేం.. విడాకుల‌పై స‌మంత స్ట‌న్నింగ్ కామెంట్..!

Samantha : టాలీవుడ్ ముద్దుగుమ్మ స‌మంత గ‌త కొద్ది రోజులుగా విడాకుల విష‌యంతో వార్త‌ల‌లో నిలుస్తుంది. ‘ఏమాయ చేసావె’ లాంటి క్లాసిక్ లవ్ స్టోరీతో తెలుగు తెరకు పరిచయం అయిన సామ్.. ఆ సినిమా అంత గొప్పగా ఆడకపోయినా తెలుగులో బిజీ హీరోయిన్లలో ఒకరైపోయింది. పదేళ్లకు పైగా స్టార్ హీరోల సరసన పెద్ద పెద్ద సినిమాలు చేసింది. పెళ్లి.. విడాకులు.. అనారోగ్యం.. ఇలా కొన్ని దశల తర్వాత ఆమె కెరీర్ జోరు తగ్గింది.

Samantha విడాకుల గురించేనా..

అనారోగ్యానికి చికిత్స కోసం గ్యాప్ తీసుకున్నాక ఆమె అవకాశాలు దాదాపు ఆగిపోయిన పరిస్థితి. ఈ మధ్య తన పుట్టిన రోజు సందర్భంగా ‘మా ఇంటి బంగారం’ పేరుతో స్వీయ నిర్మాణంలో కొత్త సినిమా అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమా ప‌ట్టాలెక్కిన‌ట్టు ఏమి తెలియ‌డం లేదు.ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. మన జీవితంలో కొన్ని విషయాలను నేర్చుకోవాలని, మరికొన్నింటిని మార్చుకోవాలని అందరూ భావిస్తారని, జీవితంలో కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు అయ్యో.. ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటామని సమంత చెప్పింది.

Samantha ఆవేశంలో జ‌రిగింది ఇప్పుడేం చేయలేం విడాకుల‌పై స‌మంత స్ట‌న్నింగ్ కామెంట్

Samantha : ఆవేశంలో జ‌రిగింది.. ఇప్పుడేం చేయలేం.. విడాకుల‌పై స‌మంత స్ట‌న్నింగ్ కామెంట్..!

అవి జరిగిపోయిన తర్వాత మార్చుకోవాలన్నా వీలుకాదని, ప్రస్తుతం వెనుతిరిగి చూసుకున్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించింది. జీవితంలో ఎదురవుతున్న ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొన్నప్పుడే జీవితాన్ని గెలిచినట్లు అవుతుందని, జరిగిపోయిన గతంతో పోలిస్తే తాను ఎంతో ధైర్యంగా సమస్యలపై పోరాడానన్నారు. ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకోవడానికి అగ్నిగుండం లాంటి సమస్యలను కూడా అధిగమించానని చెప్పారు. దీంతో సమంత మాట్లాడిన మాటలన్నీ విడాకుల గురించే అని అందరికీ అర్థమైంది. ప్ర‌స్తుతం స‌మంత చేసిన వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది