Samantha Keerthy Suresh : సమంత,కీర్తి సురేష్ లాంటి వారినే మోసం చేశాడుగా..వీడు మాములోడు కాదు..!
ప్రధానాంశాలు:
Samantha Keerthy Suresh : సమంత,కీర్తి సురేష్ లాంటి వారినే మోసం చేశాడుగా..వీడు మాములోడు కాదు..!
Samantha Keerthy Suresh : ఇటీవలి కాలంలో మోసం చేసే వారి సంఖ్య క్రమేపి పెరుగుతూ పోతుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం మోసపోతున్నారు. లబ్రిటీలకే టోకరా వేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. తాజాగా ఓ జ్యువెల్లరీ షాప్ అధినేత పలువురు సెలబ్రిటీలను, డబ్బున్న వాళ్ళను, హీరోయిన్స్ ని మోసం చేసాడు. తృతీయ జ్యూవెలరీ అధినేత కాంతి దత్ మీద తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. పరిణీతి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అంటూ శ్రీజ రెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త పెట్టుబడులు పెట్టించినట్టు సమాచారం. ఆమె మోసపోయానని గ్రహించి తాజాగా కాంతి దత్ మీద పోలీస్ కేస్ పెట్టింది.సస్టెయిన్ కార్ట్ అనే పేరుతో కాంతిదత్ మోసాలకు తెరతీశాడు.
Samantha Keerthy Suresh వారినే మోసం చేశాడా..!
పరిణీతి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అంటూ నమ్మించాడు. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలకు ఎరవేశాడు. అతడిని నమ్మి వీళ్లు కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టి మోసపోయారు. అయితే శ్రీజరెడ్డి అనే మహిళ తాను మోసపోయాయని గ్రహించి.. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హిరోయిన్లు, వ్యాపారవేత్తల నుంచి దాదాపు రూ.100 కోట్లు దోచుకున్నట్లు తెలుస్తోంది. అయితే కాంతిదత్ బాధితుల్లో కీర్తి సురేశ్, సమంత, డిజైనర్ శిల్పారెడ్డి వంటి స్టార్లు కూడా ఉన్నారు. సంతకాలను ఫోర్జరీ చేసి మోసాలకు పాల్పడ్డారనే అభియోగాలు ఉన్నాయి. సీసీఎస్‌లో కూడా అతడిపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
అయితే సస్టెయిన్ కార్ట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఏడాదిన్నర క్రితమే అందులో నుంచి బయటికి వచ్చానని శిల్పారెడ్డి నెల క్రితమే ఓ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. అలాగే కాంతిదత్‌తో కూడా తనకు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. దాదాపు 100 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో కూడా కాంతి దత్ పై కేసులు నమోదు అయ్యాయి. కాంతి దత్ బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే శ్రీజ రెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త చేసిన ఫిర్యాదుతో పోలీసులు కాంతి దత్ ని అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.