Samantha Nayanthara did not get married because of that director
Samantha : నయనతార – విఘ్నేష్ శివన్ నేడు ఘనంగా వివాహం చేసుకుంటున్నారు. అయితే, వీరిద్దరికీ అత్యంత సన్నిహితురాలైన స్టార్ హీరోయిన్ సమంత మాత్రం పెళ్లికి రాలేకపోతుందని సమాచారం. దానికి ఓ డైరెక్టర్ కారణం అంటున్నారు. గతకొంతకాలంగా
నయనతార – దర్శక, నిర్మాత విఘ్నేష్ శివన్ ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, కెరీర్ పరంగా ఇద్దరూ బిజీగా ఉండటంతో పెళ్లి విషయంలో తొందరపడకుండా ముందు కెరీర్ మీద ఫోకస్ పెట్టారు. నయనతార చేతిలో షూటింగ్ దశలో ఉన్న సినిమాలన్నీ కంప్లీట్ చేసేసింది.
ఇంకా పెళ్లికి ముందుకు కమిటైన షారుఖ్ ఖాన్ – అట్లీ సినిమా షూటింగ్ దశలో ఉంది.అలాగే, మరికొన్ని సినిమాలు ఉన్నాయి. వీటిలో మెగాస్టార్ చిరంజీవి – మోహన్ రాజాల గాడ్ ఫాదర్ కూడా ఉంది. ఇక పెళ్లి తర్వాత అప్పుడే కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ కమిటవదలుచుకోలేదట నయన్. కొన్నాళ్ళు వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడిపి అప్పుడు కొత్త సినిమాలకు సైన్ చేస్తుందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక నేడు మహాబలేశ్వరంలో నయన్ – విఘ్నేష్‌ల వివాహం జరిగింది. ఈ వేడుకకు సౌత్ సినీ స్టార్స్ అలాగే, బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ హాజరైనట్టు తెలుస్తుంది. వీరికోసం 8వ తేదీ రాత్రే గ్రాండ్ పార్టీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Samantha Nayanthara did not get married because of that director
అయితే, దాదాపు సినీ తారలందరూ హాజరైన నయన్ – విఘ్నేష్‌ల పెళ్లి వేడుకకు స్టార్ హీరోయిన్ సమంత మాత్రం రాలేకపోయినట్టు టాక్ వినిపిస్తోంది. ఇటీవలే వీరితో కలిసి సమంత.. కణ్మని రాంబో ఖతీజా సినిమా చేసింది. కాగా, సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండకు జోడీగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమా చేస్తుంది. ఫస్ట్ షెడ్యూల్ కశ్మీర్‌లో పూర్తి చేసిన మేకర్స్ ఇప్పుడు వైజాగ్ పరిసర ప్రాంతాలలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుతున్నారట. విజయ్ – సమంతలపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాడట దర్శకుడు శివ నిర్వాణ. ఎప్పుడో ఫిక్సైన షెడ్యూల్స్, ఆల్రెడీ సమంత డేట్స్ ఇచ్చి ఉండటంతోనే నయన్ పెళ్లికి హాజరవలేకపోయినట్టు సమాచారం. అయితే, ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక మాత్రం కొత్త జంటను కలిసి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వబోతుందట సామ్.
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.