Samantha : సమంత కొత్త పోస్ట్‌ రచ్చ.. న్యూ ఇయ‌ర్ రోజే నాగార్జున, నాగ చైతన్యల‌పై సామ్ ఇన్ డైరెక్ట్ టార్గెట్‌..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : సమంత కొత్త పోస్ట్‌ రచ్చ.. న్యూ ఇయ‌ర్ రోజే నాగార్జున, నాగ చైతన్యల‌పై సామ్ ఇన్ డైరెక్ట్ టార్గెట్‌..?

 Authored By kranthi | The Telugu News | Updated on :2 January 2022,11:00 am

తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు తమిళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి సమంత. అక్కినేని ఇంట్లో కోడలుగా అడుగుపెట్టి నాలుగేళ్లు తిరగకముందే.. ఆ ఇంటి నుంచి బయటికొచ్చి అందరికీ షాక్ ఇచ్చింది ఈ అమ్మడు. అయితే ఎంతో అన్యోన్యంగా, ఎంతో మందికి ఆద‌ర్శంగా ఉన్న ఈ జంట ఒక్క‌సారిగా విడి పోవడం అప్పట్లో అందరినీ కలచి వేసింది. విడాకుల సమయంలో మొదట్లో ఆమె కొంత మానసికంగా బాధపడినా.. ఆ తర్వాత నిత్యం ఎవరికో ఒకరికి పరోక్షంగా ఏదో ఒక పోస్టు పెడుతూ అభిమానులను ఆలోచనల్లో పడేస్తోంది. త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి వ‌స్తోన్న రూమ‌ర్ల‌కు చెక్ పెడుతూనే మరెన్నో అనుమానాల‌కు తావిస్తోంది. ఇలాగే సమంత తాజాగా పోస్ట్ చేసిన ఓ కొటేషన్ సామజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది.

Samantha  : నాగార్జున, నాగ చైతన్యలకు సామ్ ఇన్ డైరెక్ట్ పంచ్..?

విడాకుల అనంతరం సామ్ వరుస చిత్రాలకు సైన్ చేస్తూ తన దూకుడును కొనసాగిస్తోంది. ప్రస్తుతం తన బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో ఓ కొటేషన్ షేర్ చేసింది. ‘వారు ఏమనుకుంటున్నారు? వీరు ఏం నమ్ముతున్నారు? అని ఆలోచించాల్సిన పనిలేదు స్నేహితులారా! ఇతరుల అభిప్రాయాలు, వారి ప్రశంసలు మనకవసరం లేదు. మీరు స్వేచ్చగా ఉంటే .. వారు మిమ్మల్ని ఎప్పటికీ ఏమి చేయలేరు!’ అని అర్థం వచ్చేలా ఓ పోస్ట్ పెట్టింది. అయితే ఈ పోస్ట్ తన మాజీ మామ నాగార్జున, మాజీ భర్త నాగ చైతన్యను ఉద్దేశించి అన్నదే అని ఇప్పుడు నెటిజన్లు భావిస్తున్నారు. మరోవైపు అక్కినేని అభిమానులు విడాకుల అనంతరం కూడా సమంత నాగ చైతన్యను వదలడం లేదని మండి పడుతున్నారు. ఏదీ ఏమైనప్పటికీ కొత్త ఏడాది ప్రారంభం రోజే సామ్ పెట్టిన ఈ పోస్ట్ కూడా నెట్టింట్లో చెక్కర్లు కొడుతుంది.

samantha new year day indirect comments on naga chaitanya and nagarjuna

samantha new year day indirect comments on naga chaitanya and nagarjuna

ఇక విడాకుల అనంతరం సమంత వరుస చిత్రాలకు సైన్ చేస్తూ తన కెరీర్ పరంగా దూసుకుపోతోంది. టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని లాంగ్వేజ్ ల్లోనూ పెద్ద సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇటీవల హాలీవుడ్లోనూ ఓ చిత్రానికి ఒప్పుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. శాకుంతలం సినిమా పూర్తి చేసిన సమంత ప్రస్తుతం యశోద అనే లేడీ ఓరియెంటెడ్ పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. Ii చిత్రాలు ఈ ఏడాది విడుదల అవ్వనున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది