Samantha : ఘాటైన పదజాలంజతో కూడిన టీ షర్ట్ ధరించిన సమంత.. ఎవరి గురించి ఈ కోట్..!
Samantha: ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉంది సమంత. ఆమె పర్సనల్ లైఫ్ కాస్త డిస్ట్రబ్‌లో ఉన్నా కూడా ప్రొఫెషనల్ లైఫ్ మాత్రం దూసుకుపోతుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌లలో సినిమాలు చేస్తుంది. అయితే జీవితంలో చోటు చేసుకొన్న ఒడిడుడుకుల నుంచి బయటపడేందుకు ఇటీవల వరుసగా విహార యాత్రలు చేస్తున్నారు. ఉత్తర భారత్, కేరళలో పర్యటించిన సమంత ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో సేద తిరుతున్నది. స్విట్జర్లాండ్‌లో తనకు ఇష్టమైన ప్రదేశాలను చుట్టి వచ్చే ప్రయత్నం చేస్తున్నది. అంతేకాకుండా విదేశాల్లో హంగామా చేస్తున్నది. ఇటీవల దుబాయ్ పర్యటనకు వెళ్లి వచ్చిన భామ వెంటనే స్విట్జర్లాండ్‌లో వాలింది.
ఈ రోజు సమంత ముంబైలో తళుక్కున మెరిసింది. ముఖానికి మాస్క్, చేతిలో బ్యాగ్‌తో మెరిసిన సమంత తన టీ షర్ట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె టీ షర్ట్‌పై ఎఫ్ అనే లెటర్‌తో కూడిన కొన్ని పదాలు ఉండగా, అవి ఎవరిని ఉద్దేశించి అనే అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా సమంత సోషల్ మీడియాలో పలు కోట్స్ పోస్ట్ చేస్తూ హాట్ టాపిక్ గా మారగా, ఆమె ధరించిన టీ షర్ట్ మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సమంత రోజు రోజుకి ఇలా డేరింగ్ అండ్ డాషింగ్ గా మారుతుంది ఏంటంటూ పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం యశోదా సినిమా షూటింగుతో బిజీగా ఉన్నారు.

samantha papped bandra after long time
Samantha : సమంత ఏంటి, ఇలా మారింది..
అలాగే ఆమె నటించిన శాకుంతలం సినిమా రిలీజ్‌కు సిద్దంగా ఉంది. ఇక తమిళంలో ఆమె నయనతార, విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్న తమిళం చిత్రం కాథూ వాకులా రెండు కాదల్ చిత్రం, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ శంతరుబన్ శేఖర్ రూపొందించే చిత్రంలో, ఫిలిప్ జాన్ రూపొందించే అరేంజ్‌మెంట్ ఆఫ్ లవ్ చిత్రంలో నటిస్తున్నారు. సమంత ఓ బాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమిళ హీరో కార్తీతో కూడా ఓ సినిమా చేస్తున్నట్టు సమాచారం. ఏదేమైన సమంత వ్యవహారశైలి ఇటీవలి కాలంలో భిన్నంగా మారింది.