Samantha : పింక్ కలర్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న సమంత.. క్యూట్‌నెస్‌కి అంతా ఫిదా
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. వరుస సినిమా ఆఫర్లతో ఉక్కిరి బిక్కిరిగా మారింది. సినిమాలు, టూర్స్‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. ఒక్కోసారి సమంత చేసే పోస్ట్‌లు ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ పింక్ కలర్ డ్రెస్‌లో స్టన్నింగ్ లుక్స్‌కి సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది. సమంత క్యూట్ నెస్‌కి అభిమానులు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ప్రస్తుతం సామ్ క్యూట్ పిక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.ఇదిలా ఉంటే సమంత ఇటీవల చేసిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ అయింది.
సమంత చేసిన ట్వీట్ చూస్తే.. ‘నా మౌనం అజ్ఞానం అని, నా సైలెన్స్ అన్నిటికి అంగీకరిస్తున్నానని, నా దయని బలహీనత అని అనుకోకండి. దయాగుణానికి కూడా ఓ చివరి డేట్ ఉంటుంది. జస్ట్ చెప్తున్నాను అంతే’ అంటూ కాస్త సీరియస్ గానే ట్వీట్ చేసింది. ఇప్పుడు సమంత చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసింది అని తలలు పట్టుకుంటున్నారు. మళ్ళీ ఎవరైనా సమంతని ట్రోల్ చేశారా? లేక సమంతని ఎవరైనా ఏమన్నా అన్నారా అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు.

samantha pin color looks viral
Samantha : అందంతో చంపేస్తుందిగా..!
సమంత ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ శివ నిర్వాణ డైరెక్షన్‌లో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ చిత్రంలో విజయ్‌కి జోడీగా సమంత నటించనుంది. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో లాంచనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల్లో డైరెక్టర్ శివ నిర్వాణతోపాటు హరీశ్ శంకర్, బుచ్చిబాబు, కొరటాల శివ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆ సమయంలో సమంత విదేశాలలో ఉంది. అయినప్పటికీ మార్ఫింగ్ చేసి తాను పాల్గొన్నట్టు విజయ్ షేర్ చేశాడు.