Samantha : యశోద సినిమాలో నటించినందుకు సమంత పారితోషికం ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : యశోద సినిమాలో నటించినందుకు సమంత పారితోషికం ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు

 Authored By aruna | The Telugu News | Updated on :8 September 2022,6:30 pm

Samantha : టాలీవుడ్ లోనే కాకుండా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న హీరోయిన్ సమంత. ఈ అమ్మడు గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కమిట్ అవుతున్న విషయం తెలిసిందే. సినిమాలో ఆమె నటన మరియు అందం చూపించే అవకాశాలు ఎక్కువ ఉండేలా కథలను ఎంపిక చేసుకుంటుంది. అందులో భాగంగానే యశోద అనే సినిమాను సమంత చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఆ సినిమా విడుదల తేదీ విషయంలో రేపు టీజర్ విడుదల అయిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

ఇక యశోద సినిమా కోసం సమంత కేవలం 40 నుండి 50 రోజుల డేట్లు మాత్రమే కేటాయించినట్లుగా సమాచారం అందుతుంది. అతి తక్కువ డేట్లు కేటాయించిన కూడా సమంత భారీ పారితోషకమును అందుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. విశ్వసనీయంగా మాకు తెలిసిన సమాచారం మేరకు సమంత ఈ సినిమా కోసం రూ. 2.75 కోట్ల పారితోషికం ను తీసుకుందట. ఈ మధ్య కాలంలో సమంత తీసుకున్న పారితోషికాల్లో ఇదే అత్యధికంగా చెప్పుకుంటున్నారు. గతంలో ఇంతకు మించి పారితోషకం తీసుకున్నప్పటికీ ఆ సినిమాల కోసం సమంత ఎక్కువ రోజుల డేట్లు కేటాయించింది. కానీ తక్కువ రోజుల డేట్లు కేటాయించి కూడా ఈ స్థాయి పారితోషకం తీసుకోవడం కేవలం ఈమెకే చెల్లింది అంటూ ఇండస్ట్రీకి చెందిన కొందరు చర్చించుకుంటున్నారు.

samantha remuneration for yashoda movie

samantha remuneration for yashoda movie

ఇక ఈమె గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన శాకుంతలం సినిమా కోసం ఎంత పారితోషకం తీసుకుని ఉంటుందా అంటూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ప్రస్తుతం గ్రాఫిక్స్ వరకు జరుగుతుంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ రెండు కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలే ఈ రెండు దేశ వ్యాప్తంగా విడుదల చేయాలని ఆయా ఫిలిం మేకర్స్ భావిస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది