Samantha : సమంత వస్తోంది … నాగ చైతన్య … రెడీ గా ఉండు .. నీకు ఒక పెద్ద బాంబ్ లాంటి న్యూస్ తో వస్తోంది..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : సమంత వస్తోంది … నాగ చైతన్య … రెడీ గా ఉండు .. నీకు ఒక పెద్ద బాంబ్ లాంటి న్యూస్ తో వస్తోంది..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :8 January 2023,7:20 pm

Samantha : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ స‌మంత కొన్నాళ్లుగా మ‌యోసైటిస్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది ‘యశోద’ మూవీ రిలీజ్‌కి కొన్ని రోజులు ముందు తాను మయోసైటిస్ అనే దీర్ఘకాలిక కండరాల వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత ప్రకటించి అంద‌రిని ఆశ్చ‌ర్చ‌ప‌ర‌చింది. ఆ మూవీ డబ్బింగ్‌ వర్క్‌ని కూడా సెలైన్ సాయంతో పూర్తి చేస్తున్న ఫొటోని సమంత షేర్ చేయ‌డంతో అంద‌రు అవాక్క‌య్యారు. ఇక యశోద మూవీ ప్రమోషన్స్‌కి దూరంగా ఉండిపోయిన సమంత.. సక్సెస్ మీట్‌కి కూడా హాజరుకాలేదు. చాలా కాలం సినిమాల‌కు కూడా విరామం ఇచ్చింది స‌మంత‌.

చాలా కాలం పాటు బయట కనిపించకపోవడంతో ఆమె కెరీర్ విషయంలో రకరకాల పుకార్లు షికారు చేశాయి. వీట‌న్నింటిని బ్రేక్ చేస్తూ.. సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు ముంబైలో అడుగుపెట్టింది. హిందీలో వరుణ్ ధావన్‌తో కలిసి ‘సియాటెల్‌’ అనే వెబ్‌ సిరీస్ చేస్తుండ‌గా, ఇందులో హీరోయిన్ గా స‌మంత‌ను తప్పించి మరొకరిని తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలకు సమంత చెక్ పెడుతూ, ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం ఆమె రీసెంట్‌గా ముంబై చేరుకుంది. ముంబై ఎయిర్ పోర్టులో వైట్ క్యాస్ట్యూమ్స్‌లో ఉన్న సమంతను ఫొటోలు తీసేందుకు అక్కడి ఫొటోగ్రాఫర్లు ఎగబడ్డారు అనే చెప్పాలి..

samantha ruth prabhu arrives in mumbai

samantha ruth prabhu arrives in mumbai

Samantha : ఏం జ‌రుగుతుంది..!!

చాన్నాళ్ల తర్వాత సమంతను బయట చూసిన ఆమె అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. ‘సియాటెల్‌’ షూటింగ్ లో పాల్గొనేందుకు ఆమె ముంబై వెళ్లినట్టు తెలుస్తుండ‌గా, త్వ‌ర‌లో ఖుషీ మూవీ షూటింగ్‌లో కూడా పాల్గొన‌నుంది. ఇక శాకుంతలం సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సమంత హాజరు అవ్వడం ఖాయం అంటూ ఆమె అభిమానులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.. యూనిట్ సభ్యులు మాత్రం ఇప్పటి వరకు ఆ విషయాన్ని క్లారిటీ ఇవ్వలేదు కాని అభిమానుల తెగ ఊహించేసుకుంటున్నారు. అయితే ఈవెంట్‌కి వ‌స్తే మాత్రం నాగ చైత‌న్య‌కు ఊహించ‌ని ఝ‌ల‌క్ ఇస్తుంద‌ని అంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది