Samantha : రాజీ లాంటి మరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న సమంత..
Samantha : ప్రస్తుతం టాలీవుడ్ డ్యాషింగ్ బ్యూటీ అనాలన్నా, ఆల్ రౌండర్ అని పిలవాలన్న అది కేవలం ఒక్క సమంతకు మాత్రమే చెందుతుంది. సామ్ తన గతాన్ని గుర్తుచేసుకోకుండా ఉండేందుకు ఎక్కువగా ఒంటరిగా గడుపుతోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలనే సామ్ వేగంగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం సామ్ చేతిలో అరడజన్‌కు పైగా సినిమాలు ఉన్నాయి. ఇటీవల తెలుగులో గుణశేకర్ దర్శకత్వంలో శాకుంతలం మూవీని పూర్తి చేసిన విషయం తెలిసిందే.విడాకుల తర్వాత సామ్ స్పీడ్ పెంచింది. టాలీవుడ్‌తో పాటు తమిళ్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించేందుకు ఓకే చెప్పింది.
గతేడాది ఆమె నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్2’ వెబ్ సిరీస్ సూపర్ హిట్‌గా అయిన విషయం తెలిసిందే. మొన్నటివరకు హీరోయిన్ పాత్రలు చేసిన సామ్ తాజాగా పుష్ప సినిమాలో ఐటం గర్ల్స్‌లా మెరిసింది. ఫ్యామిలీ మెన్ సిరీస్‌లో ‘రాజీ’గా మొదటిసారి నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్ చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. సమంత తాజాగా మరోసారి చాలెంజింగ్ పాత్ర చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘రాజీ’పాత్ర వలే మరోసారి నెగెటివ్ పాత్రలో అలరించనుందట.తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, లేడీ సూపర్ స్టార్ నయనతారతో కలిసి సామ్ ‘కాత్తువాక్కుల రెండు కాదల్’అనే మూవీలో చేస్తోంది.
Samantha : ఏంటి ఆ పవర్ ఫుల్ రోల్..
దీనికి నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ డైరెక్షన్ చేస్తున్నారు.‘ఖతిజా’ అనే పాత్రలో సామ్ కనిపించనుంది. ఇది నెగెటివ్ షేడ్స్ పాత్ర అని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విజయ్ సేతుపతి, నయన తార లవ్‌కు అడ్డుపడే విలన్ పాత్రలో ఆమె కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. కాగా హాలీవుడ్ సినిమా అయిన ‘అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ సినిమాలోనూ సమంత బై-సెక్సువల్ పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్‌లో హీరో వరుణ్ ధావణ్ తో ఓ సిరీస్‌లోనూ నటించేందుకు ఓకే చెప్పిందట సమంత..