Shaakuntalam Movie : శాకుంతలం సినిమా బాలేదు వెళ్ళక్కర్లేదు అనుకునే వాళ్ళు కంపల్సరీ చదవాల్సిన న్యూస్ ఇది !
Shaakuntalam Movie : సౌత్ ఇండియన్ బ్యూటీ సమంత నటించిన ‘ శాకుంతలం ‘ సినిమా ఈరోజు విడుదలైంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే కొంతమంది జనాలు శాకుంతలం సినిమా బాగుంది అని అంటున్నారు. మరికొంతమంది తలనొప్పిగా ఉందంటూ బుర్ర పీక్కుంటున్నారు. అయితే ఈ సినిమా నేటి కాలం జనరేషన్ కి అర్థం కాకపోవచ్చు కానీ అందులో ఉన్న రియల్ ఫీలింగ్ ని అర్థం చేసుకుంటే ఇంతకన్నా గొప్ప సినిమా ఏది లేదని పెద్దవాళ్ళు చెప్పుకొస్తున్నారు.
ఇప్పటి జనరేషన్ వాళ్లకి భారత ఇతిహాసాల గురించి సరిగా తెలియదు. మహాభారతం ఆధారంగా తెరకెక్కిన ఈ శాకుంతలం సినిమా నేటి యువత తప్పక చూడాలి. ఈ సినిమా స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నం. నేటి కాలంలో డేటింగ్ అంటూ హద్దులు మీరుతున్న ప్రేమికులకి ఈ సాంప్రదాయాలు తెలియకపోవచ్చు కానీ ఇప్పటి జనరేషన్ వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది అని చెప్పుకొస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రేమ అనేది శరీరానికి సంబంధించింది కాదని మనసుకు సంబంధించింది అని, నమ్మిన వ్యక్తి ప్రేమించిన వ్యక్తికి మనసిస్తే ఎలా చూసుకుంటాడో చెప్పేది ఈ శాకుంతలం సినిమా అని చెప్పుకొస్తున్నారు.
అందుకే ఇప్పటి జనరేషన్ వాళ్ళు శాకుంతలం సినిమాను కచ్చితంగా చూడాలి అని సినిమా చూసిన పెద్దవాళ్ళు అంటున్నారు. ఇప్పటి కాలం వాళ్లు పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తున్నారు. దైవ ధ్యానం చరిత్ర పురాణాల గురించి అసలు పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వస్తేనే భారత ఇతిహాసాలు ఎంత గొప్పదో ఈ జనరేషన్ వాళ్లకి తెలుస్తుంది. మొత్తానికి ఈ సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఇక సమంత శకుంతల పాత్రలో, దేవ్ మోహన్ దుష్యంతుడు పాత్రలో నటించి అద్భుత ప్రేమ కావ్యాన్ని ప్రజలకు అందించారు.