Samantha : నాగ చైతన్యని మించిన సమంత.. సిటాడెల్ కోసం అంత రెమ్యునరేషన్ తీసుకుందా?
ప్రధానాంశాలు:
Samantha : నాగ చైతన్యని మించిన సమంత.. సిటాడెల్ కోసం అంత రెమ్యునరేషన్ తీసుకుందా?
Samantha : సమంత క్రేజ్ అప్పటికీ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. మయోసైటిస్ వలన కొన్నాళ్లు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు తిరిగి సినిమాలు చేసేందుకు రెడీ అంటుంది. అయితే రీసెంట్‌గా సిటాడెల్ వెబ్ సిరీస్‌తో పలకరించి అలరించింది.సమంత ఇంతకుముందు రాజ్ మరియు డికెతో కలిసి పనిచేసింది. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో నటించింది. ఇది భారీ విజయం సాధించింది. ఆమె నటించిన మెుదటి వెబ్ సిరీస్ భారీగా హిట్ కావడంతో సిటడెల్ పారితోషికం పెంచినట్లు సమాచారం. రిపోర్ట్స్ ప్రకారం సమంత సిటాడెల్: హనీ బన్నీలో ఆమె పాత్రకు రూ.10 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. ఈ పారితోషికం ఇప్పటివరకు భారతీయ వెబ్ సిరీస్‌లలో అత్యధిక రెమ్యునరేషన్.
Samantha భారీ రెమ్యునరేషన్..
సిటాడెల్‌లో సమంత యాక్టింగ్ అదిరిపోయిందని.. సామ్ ఈజ్ బ్యాక్ అంటూ నెట్టింట కామెంట్స్ హోరెత్తిస్తున్నారు ఫ్యాన్స్. గతంలో ఫ్యామిలీ మ్యాన్ 2లోనూ సామ్ యాక్షన్ సన్నివేశాల్లో సత్తా చాటింది. ఇదిలా ఉంటే.. పుష్ప చిత్రంలో ఊ అంటావా స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా రూ.5 కోట్లు పారితోషికం తీసుకుందని టాక్. స్పై యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన సిటాడెల్ వెబ్ సిరీస్ కు నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్రిల్లింగ్ కథాంశంతోపాటు ఊహించని ట్విస్టులు, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్ తో ఈ సిరీస్ జనాలను కట్టిపడేస్తుంది. ఇక ఇందులో మరోసారి యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేసింది. దర్శకద్వయం రాజ్ అండ్ డీకే మళ్లీ సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ తో అలరించారు. గతంలో ఈ దర్శక జోడీ ది ఫ్యామిలీ మేన్-2 వెబ్ సిరీస్ ను తెరకెక్కించింది. ఇందులో కూడా సమంత లీడ్ రోల్ పోషించారు.
అప్పటి సంగతులను రాజ్ అండ్ డీకే తాజాగా పంచుకున్నారు. ఫ్యామిలీ మేన్-2 చిత్రీకరణ పూర్తయిపోయిందని చెప్పగానే సమంత ఏడ్చేశారని వెల్లడించారు. “షూటింగ్ అయిపోయిందా, ఇంకే ఏమైనా బ్యాలన్స్ ఉందా? అని సమంత మమ్మల్ని అడిగారు. ఇంకేమీ లేదు… షూటింగ్ కంప్లీట్ అయిందని చెప్పాం. దాంతో ఆమె చిన్నపిల్ల మాదిరిగా ఏడ్చేశారు. దాంతో మేమిద్దరం ఒకరి ముఖం ఒకరం చూసుకున్నాం. ఆమె ఎందుకు ఏడ్చిందా అని ఆలోచించాం. ఆమెను మేం చిత్రీకరణ సమయంలో బాగా ఇబ్బంది పెట్టామేమో అనిపించింది. ఫ్యామిలీ మేన్-2 చిత్రీకరణ సమయంలో సమంత మనోవేదనతో ఉన్న విషయం మాకు తెలియదు” అని రాజ్ అండ్ డీకే వివరించారు