Samantha : చెవిలో పువ్వు పెట్టిన సమంత!.. మామూలు రచ్చ కాదిది
Samantha : సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. గత నెల రోజుల నుంచి ఏదో ఒక విషయంలో సమంత నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతూనే ఉంది. విడాకుల విషయం, రూమర్లు, కోర్టు కేసు, ఛార్ ధామ్ యాత్రలు, దుబాయ్‌లో షికార్లు ఇలా ఎన్నెన్నో విషయాలతో సమంత జనాల నోళ్లలో నానుతూనే ఉంది. అయితే ఇప్పుడు మాత్రం సమంత పూర్తిగా తన బిజినెస్, కెరీర్ మీదే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. తన ఫ్రెండ్స్‌తో ఫుల్ చిల్ అవుతూ సమంత తెగ హల్చల్ చేస్తోంది.

Samantha Wears Saaki Dress
తన సాకీ బ్రాండెడ్ దుస్తులను ప్రమోట్ చేసుకునేందుకు సమంత ఎంతలా తాపత్రయ పడుతుందో అందరికీ తెలిసిందే. సమంత ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు కనిపిస్తోంది. ఫ్యామిలీ మెన్ సీజన్ 2 తరువాతే సమంతకు బాలీవుడ్ అవకాశాలు వచ్చాయట. కానీ ఫ్యామిలీ ప్లానింగ్‌లో భాగంగా కెరీర్‌కు కాస్త బ్రేక్ ఇవ్వాలని అనుకుందట. కానీ ఇంతలోపే విడాకుల వ్యవహారం కూడా బయటకు వచ్చింది. దీంతో ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుంది.
Samantha ; సాకీ దుస్తుల్లో సమంత..

Samantha Wears Saaki Dress
ఈ క్రమంలో గోవాలో జరిగే ఐఫా వేడుకల్లో వక్తగా పాల్గొనాలని సమంతకు పిలుపు వచ్చింది. ఈ అరుదైన అవకాశం, గుర్తింపు సాధించిన దక్షిణాది హీరోయిన్‌గా సమంత పేరు మార్మోగిపోతోంది. అలా సమంత ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరినీ ఆకర్షించేందుకు రెడీ అవుతోంది. అయితే సమంత తాజాగా తన సాకీ దుస్తులను ధరించింది. వెరైటీ పోజులు పెట్టింది. అందులో సమంత తన చెవిలో పెట్టుకున్న పువ్వు, పెట్టిన పోజులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.