Samantha : వెటర్నరీ హాస్పిట‌ల్‌కు స‌మంత‌.. ఎందుకంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : వెటర్నరీ హాస్పిట‌ల్‌కు స‌మంత‌.. ఎందుకంటే..?

 Authored By mallesh | The Telugu News | Updated on :15 October 2021,11:45 am

Samantha : బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత.. తన భర్త, హీరో నాగచైతన్యతో విడిపోయినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సోషల్ మీడియాలో అనేక సందర్భాల్లో వివిధ రకాల ఎమోషన్ పోస్టులు పెడుతూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది సామ్. అయితే వీరిద్దరు విడిపోయిన విషయం టాలీవుడ్‌లో అనేక చర్చలకు దారి తీసింది. చాలా రూమర్స్ సైతం వచ్చాయి. అయినా వాటిని సామ్ పెద్దగా పట్టించుకోలేదు. వాటిపై ఎక్కువగా స్పందించలేదు. అప్పటి నుంచి ఈ అమ్మడు బయట ఎక్కడా కనిపించలేదు.

Samantha Went to Veterinary Hospital

Samantha Went to Veterinary Hospital

Samantha : వాటికోసమే…

అయితే సామ్ తాజాగా వెటర్నరీ క్లినిక్‌లో దర్శనమిచ్చింది. తన పెంపుడు కుక్కల కోసం సామ్ అక్కడికి వచ్చిదట. వాటికి అక్కడ హెల్త్‌చెకప్ చేయించింది. ఆ పెంపుడు కుక్కలంటే సామ్‌కు ఎంత ఇష్టమో స్పెషల్‌గా ప్రస్తావించే అవసరం లేదు. ఆ కుక్క పిల్లలే తన బిడ్డలు అంటూ చెబుతున్న సామ్.. వాటిని ప్రాణానికి ప్రాణంలా చూసుకుంటున్నది. ఆ కుక్క పిల్లలతో కలిసి వెటర్నరీ ఆస్పత్రికి వెళ్లిన సామ్.. అక్కడ వాటికి హెల్త్ పరీక్షలు చేయించింది. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా సామ్, నాగచైతన్యతో కలిసి ఏమాయ చేశావే.. సినిమాలో నటించి వెండితెరకు పరిచయమైంది. అప్పటి వరకు హిట్స్ కోసం పరితపిస్తున్న నాగచైతన్య..

Samantha Went to Veterinary Hospital

Samantha Went to Veterinary Hospital

ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి ఆటోనగర్ సూర్య, మనం, మజిలి వంటి చిత్రాల్లో నటించారు. ముందునుంచే ప్రేమలో ఉన్న వీరు పెండ్లి చేసుకుని కొత్త జర్నీ స్టార్ట్ చేశారు. కానీ రెండేండ్లకే ఆ జర్నీకి బ్రేక్ పడింది. ఇందుకు సంబంధించి వీరిద్దరు ఒక్కోలా స్పందించారు. కానీ విడిపోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఇక వీరిద్దరు విడిపోయాక ప్రస్తుతం ఎవరి లైఫ్‌లో వారు బిజీగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకు తాను తదుపరి సినిమాల గురించి సామ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. సామ్.. ఇప్పటి వరకు ప్రకటించిన ప్రాజెక్టుల్లో శాకుంతలం మావీయే చివరిది. సామ్ తదుపరి ప్రాజెక్టుల విషయాలపై ఆమె ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది