Samantha : నిన్ను నిరాశపర్చను!.. సమంత మామూల్ది కాదు

0
Advertisement

Samantha : సమంత దెబ్బకు ట్రైనర్ పరేషన్ అవుతున్నట్టు కనిపిస్తోంది. సమంత జిమ్‌లో ఎంత డెడికేషన్ చూపిస్తుందో అందరికీ తెలిసిందే. సమంత రెండ్రోజుల క్రితం చేసిన లెవెల్ అప్ చాలెంజ్ దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సమంత లెవెల్ అప్ చాలెంజ్‌ను స్వీకరించారు. సమంతలా వర్కవుట్లు చేశారు. అదీ సమంత లెవెల్.

ఇక సమంత ఒకప్పుడు వంద కిలోల వెయిట్‌ను కూడా లిఫ్ట్ చేసింది. అమల, నాగ్, చైతూ, సమంత అందరూ కలిసి ఆ మధ్య జిమ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సమంత మళ్లీ నాటి ఫిట్ నెస్ కోసం ట్రై చేస్తోంది. అందుకే బరువులను పెంచుకుంటూ వెళ్తోంది. సమంత చేస్తోన్న ఈ వర్కవుట్లు ఏదైనా సినిమా కోసమా? లేదంటే కేవలం ఫిట్ నెస్ కోసమా? అన్నది చూడాలి.

Samantha Workouts With Junaid Khan
Samantha Workouts With Junaid Khan

Samantha : వెయిట్ లిఫ్టింగ్‌లో సమంత..

సమంత ఇప్పుడు వరుసగా బరువులు పెంచుకుంటూ వర్కవుట్లు చేస్తూనే ఉంది. ట్రైనర్ జునైద్ ప్రోత్సహిస్తూ ఉంటే ఇంకా సమంత పెంచుకుంటూనే పోతోంది. 75 కిలోల వెయిట్‌ను లేపింది సమంత. ఆ తరువాత 78 కిలోలను లిఫ్ట్ చేసింది. నిన్ను నిరాశపర్చను.. నేను నిద్రలేచేదే నిన్ను నిరాశపర్చుకుండా ఉండేందుకు.. అంటూ సమంత నవ్వేసింది. ఆ తరువాత 80 కిలోల వెయిట్‌ను సమంత లేపింది. మొత్తానికి సమంత మాత్రం జిమ్‌లో దుమ్ములేపుతోంది.

Advertisement