Sarath Kumar : ఇండస్ట్రీలో అవన్నీ కామన్.. కూతురి ప్రేమపై శరత్ కుమార్ కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sarath Kumar : ఇండస్ట్రీలో అవన్నీ కామన్.. కూతురి ప్రేమపై శరత్ కుమార్ కామెంట్స్

 Authored By bkalyan | The Telugu News | Updated on :15 November 2021,4:20 pm

Sarath Kumar : సినిమా ఇండస్ట్రీలో తారలపై రూమర్లు వస్తుంటాయి. ప్రేమలు, బ్రేకప్పులు, గొడవలపై ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. తారల ప్రపంచం అంటేనే అలా ఉంటుంది. అయితే శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రేమాయణం మీద కొన్ని రూమర్లు వచ్చాయన్న సంగతి తెలిసిందే. విశాల్‌తో వరలక్ష్మీ ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని రూమర్లు వచ్చాయి.

అయితే నడిగర్ సంఘం ఎన్నికలతో ఈ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. శరత్ కుమార్ మీద విశాల్ ఆరోపణలు చేయడం, దానికి ప్రతిస్పందనగా వరలక్ష్మీ కౌంటర్లు వేయడం అందరికీ తెలిసిందే. ఆ గొడవలతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. మొత్తానికి వరలక్ష్మీ, విశాల్ ఇప్పుడు ఫ్రెండ్స్‌గా కూడా ఉండటం లేదని తెలుస్తోంది. అయితే కూతురి ప్రేమాయణం మీద శరత్ కుమార్ స్పందించాడు.

Sarath Kumar On Varalaxmi Love Affair With Vishal

Sarath Kumar On Varalaxmi Love Affair With Vishal

Sarath Kumar : వరలక్ష్మీపై శరత్ కుమార్ కామెంట్స్

తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయం చెప్పాడు. ఈ ఇండస్ట్రీలో అలాంటివన్నీ కామన్ అని అన్నాడు. ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుందని తెలిపాడు.ఇండస్ట్రీలోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు.. ఇలాంటివన్నీ వస్తాయని, వీటికి భయపడకూడదు అని అన్నారు.

ఇలాంటి బ్యాగెజ్ ఎప్పుడూ ఉంటుందని, బ్యాగేజ్ కావాలా? ప్రొఫెషన్ కావాల? అన్నది నిర్ణయించుకోవాలి. అలాంటి వాటిని మనం పట్టించుకోకూడదు. రూమర్లు వస్తూనే ఉంటాయి. అవన్నీ మా అమ్మాయి దాటేసింది. ఇప్పుడు అంతా బాగుంది.. తనకు అన్నీ తెలుసు అంటూ వరలక్ష్మీ గురించి తండ్రి శరత్ కుమార్ చెప్పుకొచ్చాడు.

Advertisement
WhatsApp Group Join Now

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది