Varalaxmi Sarathkumar : స్టార్ హీరో కూతురిని అయిన రూమ్ బుక్ చేస్తావా అని అడిగాడు.. వరలక్ష్మీ షాకింగ్ కామెంట్..!
ప్రధానాంశాలు:
Varalaxmi Sarathkumar : స్టార్ హీరో కూతురిని అయిన రూమ్ బుక్ చేస్తావా అని అడిగాడు.. వరలక్ష్మీ షాకింగ్ కామెంట్..!
Varalaxmi Sarathkumar : తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన ఎన్నో సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. ఇక ఆయన కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంది.తమిళంలో మంచి సినిమాలు చేస్తూ తెలుగులో ప్రతినాయక పాత్రలతో ప్రవేశించింది. ఆహార్యం, గంభీరం చూసి అందరూ ఆమె నటనకు, అందానికి ఫిదా అయ్యారు. స్టార్ హీరోలకు ధీటుగా నిలబడి డైలాగులు చెప్పే తీరుకు అందరూ మంత్ర ముగ్ధులవుతున్నారు.వరలక్ష్మి నటించిన చిత్రం శబరి. పాన్ ఇండియా సినిమాగా వచ్చే నెల మూడోతేదీన విడుదల కాబోతోంది.
Varalaxmi Sarathkumar : వరలక్ష్మీకి వేధింపులా..
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో వరలక్ష్మీ ప్రమోషన్లు మొదలుపెట్టింది. సినిమాపై రోజురోజుకు హైప్ క్రియేటవుతోంది. తాజగా ఒక ఇంటర్వ్యూలో వరలక్ష్మీ.. స్టార్ హీరో కూతురును అయ్యి కూడా క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నట్లు తెలిపింది. పరిశ్రమలో అమ్మాయిలు రాణించడం చాలా కష్టం. నాన్నకు ఇష్టం లేకపోయినా పరిశ్రమకు రావాల్సి వచ్చింది. మొదట్లో స్ట్రగుల్ అయినప్పటికీ తర్వాత మంచిపేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే తమిళనాడుకు చెందిన ఓ టీవీ ఛానెల్ యజామానిక తన దగ్గరకు వచ్చాడని, ఒక ప్రాజెక్టు ఉందని, కలిసి పనిచేయాలని కోరాడు

Varalaxmi Sarathkumar : స్టార్ హీరో కూతురిని అయిన రూమ్ బుక్ చేస్తావా అని అడిగాడు.. వరలక్ష్మీ షాకింగ్ కామెంట్..!
అప్పుడు నేను ఓకే చెప్పాను. కొంచెంసేపు గడిచిన తర్వాత మనం బయట కలుద్దాం అన్నాడు. నేను ఎందుకు అని అడిగాను. అలా మాట్లాడుకుందాం.. రూమ్ బుక్ చేస్తాను అన్నాడు. ఒక హీరో కూతురు అయిన నన్నే ఇలా అడిగితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని అమ్మాయి పరిస్థితి ఏమిటి? అనిపించింది. వెంటనే అతనిపై కేసు పెట్టాను. ఈ సంఘటన జరిగి దాదాపు ఆరు సంవత్సరాలవుతోంది. స్టార్ హీరో కూతురుగా ఉన్నానుకానీ తనకేం అవకాశాలు రాలేదని చెప్పింది. కమిట్ మెంట్ అడగకుండా లేరు. అన్నీ చూశాను.. కొన్ని అవకాశాలను వదులుకున్నాను. కొన్నింటిలో నన్ను తీసేశారని వరలక్ష్మీ శరత్ కుమార్ తన పాత అనుభవాలు చెప్పుకొచ్చింది.