Sarkaru Vaari Paata : సర్కారు వారి పాటనా, మజాకానా.. ఏకంగా కాపీ కొట్టేసిన సుప్రీంకోర్ట్
Sarkaru Vaari Paata : మహేష్ బాబు, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో పరశురాం తెరకెక్కించిన చిత్రం సర్కారు వారి పాట. మే 12న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులని అలరించింది. అయితే ఇటీవల మహేష్ బాబు ఎక్కుగా సోషల్ మెసేజ్ నేపథ్యంలో సినిమాలు చేయడం, ఆ సినిమా కాన్సెప్ట్‌ని పలువురు ఆచరించడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. మహర్షి సినిమా చూసి చాలా మంది సండే వ్యవసాయం అంటూ గ్రామాలకు వెళ్లి వ్యవసాయం చేశారు.ఇక ఇప్పుడు సర్కారు వారి పాట చిత్రంలో ఇచ్చిన తీర్పు మాదిరిగానే సుప్రీంకోర్ట్ తీర్పు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.రైతు రుణాల రీకవరి విషయంలో సుప్రీంకోర్ట్ కీలక తీర్పు వెలువరించింది.
రుణాల రీకవరీ విషయంలో బ్యాంకులు వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ముందు పెద్ద చేపలను పట్టుకున్న తర్వాత రైతులు జోలికి వెళ్లాలని బ్యాంకులకు సూచించారు జస్టిస్ డీవై చంద్రచూడ్. బ్యాంకులు వేసిన పిటిషన్‌పై జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పిటిషన్ల కారణంగా రైతులు చితికి పోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బ్యాంకులు లోన్‌ల రీకవరి విషయంలో పేదలు, సామాన్యులు, సంపన్నులు, పలుకుబడి కలిగిన వ్యక్తుల మధ్య ఎలాంటి తేడాలతో వ్యవహరిస్తున్నాయనే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. ప్రస్తుతం సుప్రీం తీర్పు కూడా సర్కార్ వారి పాటకు దగ్గరగా వుండటం గమనార్హం. సర్కారు వారి పాట చిత్రాన్ని పరశురాం తెరకెక్కించగా, ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించింది.
Sarkaru Vaari Paata : సేమ్ తీర్పు..
మే12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ప్రస్తుతం థియేటర్స్ లో ఈ చిత్రం సక్సెస్ ఫుల్‌గా నడుస్తుంది.ఎస్‌వీపీ సినిమాలో మహేశ్ బాబు చాలా స్టైలీష్‌గా కనిపించడంతో పాటు తన పర్‌ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. ముఖ్యంగా మహేష్ఎం కీర్తి సురేష్ మధ్య వచ్చే సన్నివేశాలు సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. దీంతో తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఎస్‌వీపీ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు దాదాపు రూ. 36.63 కోట్ల కలెక్షన్స్ వసూల్ చేసింది. అత్యధికంగా నైజాంలో రూ.12.24 కోట్ల షేర్ కలెక్షన్ రాబట్టింది.