Hyper Aadi : జబర్దస్త్ రీ ఎంట్రీపై మౌనం.. శ్రీదేవీ డ్రామా కంపెనీలో హైపర్ ఆదిపై సెటైర్లు
Hyper Aadi : హైపర్ ఆదికి బుల్లితెరపై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెరపై పంచుల ప్రవాహాం, సెటైర్లతో దాడి చేయాలంటే అది హైపర్ ఆది వల్లే సాధ్యమవుతుంది. ఒక్కోసారి హైపర్ ఆది వేసే జోకులు హద్దులు దాటుతుంటాయి. శరీరాకృతి మీద హద్దులు మీరి కౌంటర్లు వేస్తుంటాడు. అలా శాంతి, వర్ష, ఫైమా వంటి వారి మీద ఆది వేసే కామెంట్లు ఒక్కోసారి ఎబ్బెట్టుగా ఉంటాయి. అయినా కూడా ఆది స్కిట్లకు ఉండే క్రేజ్ వేరు. ఆయన స్కిట్ల కోసం షోను చూసే వారెంతో మంది ఉన్నారు.అయితే గత కొన్ని వారాలుగా జబర్దస్త్ షోలో ఆది కనిపించడం లేదు.
మ్యాటర్ ఏంటన్నది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. మొత్తానికి జబర్దస్త్ షోకి దూరంగా ఉన్నాడా? లేదంటే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల షోకు రాలేకపోతోన్నాడా? అనేది మాత్రం అర్థం కావడం లేదు. ఈ విషయం మీద ఇప్పటికే స్కిట్ల రూపంలో ఎన్నో కౌంటర్లు పడ్దాయి. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలోనూ జబర్దస్త్ ప్రస్థావన వచ్చింది. అందులో ఆది వేసిన స్కిట్లో తన మీద తానే సెటైర్ రాసుకున్నట్టు కనిపిస్తోంది.చాలా రోజుల తరువాత టిక్ టాక్ భాను ఆది పక్కన కనిపించింది. ఈ ఇద్దరు శోభనానికి రెడీ అవుతారు. కానీ ఇంతలోనే అది క్యాన్సిల్ అవుతుంది. దీంతో ఆది నిరుత్సాహ పడతాడు.

Satires on Hyper Aadi About Jabardasth In Sridevi Drama Company
అయితే ఇంతలో సీరియల్ నటి శ్రీవాణి భర్త వచ్చి కౌంటర్లు వేస్తాడు. ఎప్పుడైతే నువ్ జబర్దస్త్ షోకి వస్తావో.. అప్పుడే నీ శోభనం అని అంటాడు. అయితే అది మాత్రం జరగదేమో అన్నట్టుగా ఆది దాన్ని పక్కకి తప్పించాడు. అలా తన మీద సెటైర్ వేసినా కూడా రియాక్ట్ అవ్వలేదు. జబర్దస్త్ షో మీద ఇంకా మౌనంగా ఉండిపోయాడు.మరి ఇంతకీ ఆదికి జబర్దస్త్ షోకి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చింది అనేది మాత్రం తెలియడం లేదు. దీంతో ఆదికి మల్లెమాలకు చెడిందనే ప్రచారం వచ్చింది. అలా అయితే ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీల్లో ఎందుకు వస్తున్నాడంటూ ఇంకొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు