NTR : ఎన్టీఆర్ ఎంత చెప్పిన వినకపోవడం తో సావిత్రిని పక్కన పెట్టి కృష్ణ కుమారి తో ఎన్టీఆర్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

NTR : ఎన్టీఆర్ ఎంత చెప్పిన వినకపోవడం తో సావిత్రిని పక్కన పెట్టి కృష్ణ కుమారి తో ఎన్టీఆర్…!

 Authored By prabhas | The Telugu News | Updated on :17 December 2022,10:30 am

NTR : అప్పటి సినిమాల్లో ఎన్టీఆర్ సావిత్రి కాంబినేషన్ అంటే ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూసేవారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ అంటే ఆ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అయినట్లే అని అనుకునేవారు. అయితే సావిత్రి ఫుల్ బిజీగా ఉండడం, తమిళంలో కూడా నటించడం వలన తెలుగులో ఒకటి రెండు సినిమాలు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇలా వదులుకున్న సినిమాల్లో ఒకటి శ్రీ తిరుపతమ్మ కథ. అసలు ఈ సినిమాను సావిత్రిని దృష్టిలో పెట్టుకొని రెడీ చేసుకున్నదే. ఈ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారు. ఇక హీరోయిన్గా సావిత్రిని ఫిక్స్ చేశారు దర్శక నిర్మాతలు.

కానీ అప్పటికే సావిత్రి వేరే సినిమాలలో బిజీగా ఉంది. ఇక ఆ ఛాన్స్ కృష్ణకుమారికి ఇచ్చారు. వాస్తవానికి ఈ సినిమాలో సావిత్రి ని తీసుకోవాలని ఎన్టీఆర్ కూడా ఎంతో ప్రయత్నం చేశారు. అయితే ఆమె కాల్ షీట్లు ఖాళీగా లేవన్న విషయం ఆయనకు తెలియదు. ఇక దర్శక నిర్మాతలు కూడా మీరు చెబితే సావిత్రి ఒప్పుకుంటారు అని ఎన్టీఆర్ ను ఒత్తిడి చేశారు. దీంతో అన్నగారు సావిత్రిని హీరోయిన్గా పెట్టండి, నేను ఆమెను ఒప్పిస్తాను అని మాటిచ్చారు. ఎన్టీఆర్ సావిత్రిని ఎంతో రిక్వెస్ట్ చేశారు కానీ ఆమె నో చెప్పేశారు.

Savitri was left aside and NTR with Krishna Kumari

Savitri was left aside and NTR with Krishna Kumari

ఇక అన్నగారు కృష్ణకుమారి అయితే నష్టం ఏంటి అని ప్రశ్నించి మరి ఆమెను ఒప్పించారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అప్పట్లో కృష్ణకుమారికి ఒక గుణం ఉండేదట. తనను దృష్టిలో పెట్టుకొని రాసిన కథలను మాత్రమే ఆమె నటించారు తప్పితే మరెవరో కాదు.. ఎవరి కోసం చేసిన వంటలు నేను ఎలా తింటాను అని అనేవారట. అయితే అన్నగారు ఆమెన్ రిక్వెస్ట్ చేసి ఒప్పించారట. ఈ సినిమాలో నటించేలా చేశారట. ఇక ఈ సినిమా కూడా రికార్డు స్థాయిలో హిట్ అయింది. సావిత్రి నో చెప్పడంతో ఎన్టీఆర్ కావాలని కృష్ణకుమారిని ఒప్పించాక కొద్ది రోజుల వరకు ఎన్టీఆర్ సావిత్రితో మాట్లాడలేదని అంటుంటారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది