Sekhar Master : శేఖర్ మాస్టర్‌కు బంపర్ ఆఫర్.. చిరంజీవితో ఏకంగా అలా
Sekhar Master మెగాస్టార్ చిరంజీవికి స్టెప్పులు కంపోజ్ చేయాలని ప్రతీ ఒక్క కొరియోగ్రఫర్‌కు కోరిక ఉంటుంది. అయితే శేఖర్ మాస్టర్ స్వతాహాగానే చిరంజీవి అభిమాని. అలాంటి శేఖర్ మాస్టర్‌కు చిరు చేత స్టెప్పులు వేయించే చాన్స్ వస్తే ఎలా ఉంటుంది.. ఎలా కంపోజ్ చేస్తాడు అనేది మనం ఖైదీ నెంబర్ 150లో చూశాం.
అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అనే ఐకాన్ స్టెప్పుతో అదరగొట్టేశాడు.అలాంటి శేఖర్ మాస్టర్‌కు ఇప్పుడు అదిరిపోయే ఆఫర్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్‌లో రాబోతోన్న యాక్ష్ ఎంటర్టైనర్ భోళా శంకర్ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

Sekhar Master In Chranjeevi Bholaa Shankar
Sekhar Master : భోళా శంకర్‌కు శేఖర్ మాస్టర్
ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను హైద్రాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో నవంబర్ 11న ఉదయం 7:45 గంటలకు ఘనంగా నిర్వహించారు.అయితే ఈ సందర్భంగా కాస్ట్ అండ్ క్రూ డీటైల్స్ రిలీజ్ చేశారు. ఇందులో కొరియోగ్రఫర్‌గా శేఖర్ మాస్టర్ పేరు మాత్రమే ఉంది.
అంటే సింగిల్ కార్డ్ కొరియోగ్రఫర్‌గా అదిరిపోయే చాన్స్ కొట్టేశాడు. మొత్తానికి భోళా శంకర్ సినిమా మాస్ ఎంటర్టైనర్. దానికి తగ్గట్టుగా మళ్లీ అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేసేందుకు శేఖర్ మాస్టర్ రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది.