Home » Entertainment » Senior Actress Kavitha Loss Jeera Properties
Entertainment

Senior Actress : నూట ముప్పై రెండు కోట్ల ఆస్తి నష్టం – ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న సీనియర్ నటి !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 17, 2023, 11:00 am
Advertisement

Senior Actress : తెలుగు పరిశ్రమలో తనదైన శైలిలో నటించి మెప్పించిన నటీమణుల్లో ఒకరు కవిత. చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరో హీరోయిన్లకు తల్లి, అత్త పాత్రలలో నటించింది. ఇప్పుడు సినిమాలకు దూరం అయింది. ఇక సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా అప్పుడప్పుడు సందడి చేస్తూ ఉంటుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన కీలక సంఘటనల గురించి చెప్పుకొచ్చింది. ఆమె తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. తన భర్త 132 కోట్ల వ్యాపారంలో నష్టపోయారు అంటూ చెప్పుకొచ్చారు. ఎన్నో విపత్తులు వచ్చి తన జీవితాన్ని అతలాకుతలం చేశాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Senior Actress Kavitha loss jeera properties

బాల నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సినిమాల్లో నటించి మంచి పేరు దక్కించుకున్నాయి. కొన్ని కారణాల వలన 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నాను. పెళ్లి తర్వాత సినిమాకు దూరం అయ్యాను. పెళ్లి అయిన తర్వాత అప్పటికే కమిట్ అయినా సినిమాలను పూర్తి చేశాను. పెళ్లి తర్వాత కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ చేయనని చెప్పాను. ఇండస్ట్రీ లో సహాయ నటిగా కెరీర్ ను మొదలు పెట్టారు. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించాను. నా భర్త నన్ను మహారాణిగా చూసుకున్నారు. మాకు 11 దేశాల్లో ఆయిల్ బిజినెస్ లు ఉండేవి. ప్రతి విషయంలో కూడా ఆయన నన్ను చాలా గౌరవించేవారు.

Advertisement

ఏడు సంవత్సారాల క్రితం వ్యాపారంలో నష్టం రావడంతో చాలా ఆస్తులు పోగొట్టుకున్నాను. 132 కోట్లని పోగొట్టుకున్నాం. కరోనా వచ్చాక నా భర్త మరియు కుమారుడు మరణించారు. బాబు చనిపోయిన పది రోజుల గ్యాప్లో భర్త కూడా చనిపోవడంతో జీవితం మొత్తం చీకటి అల్లుకుంది. దీంతో చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను కానీ నా కూతుర్లను చూసి ఆగిపోయేదాన్ని. ఆ బాధ నుండి బయటపడేందుకు ఏదో ఒక పని చేస్తూ ఉండాలని భావిస్తున్నట్లు పేర్కొంది. మళ్ళీ నటిగా బిజీ అవ్వాలని చూస్తున్నట్లు తెలిపింది. ఎలాంటి పాత్రలు వచ్చిన చేసేందుకు రెడీ అని కవిత అన్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి