Remuneration : ఇద్దరు పిల్లల ఆంటీ కోట్ల డిమాండ్‌.. బాబోయ్‌ నీకో దండం అంటున్న నిర్మాతలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Remuneration : ఇద్దరు పిల్లల ఆంటీ కోట్ల డిమాండ్‌.. బాబోయ్‌ నీకో దండం అంటున్న నిర్మాతలు

 Authored By aruna | The Telugu News | Updated on :15 September 2022,8:30 pm

Remuneration : టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి పలు సూపర్ హిట్ సినిమాలు ఆమె నటించింది, దాదాపు దశాబ్ద కాలం పాటు టాలీవుడ్ లో పదుల సంఖ్యలో సినిమాలను చేసింది. తమిళంలో కూడా ఈమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. తెలుగులో ఈమె చేసిన సినిమాలు ఇప్పటికీ కూడా టీవీలో వస్తు సక్సెస్ ని దక్కించుకుంటున్నాయి. టాలీవుడ్ లో మంచి జోరు మీద ఉన్న సమయంలోనే బాలీవుడ్ నుండి ఆఫర్ రావడంతో అక్కడికి వెళ్ళింది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ సినిమాలను కూడా ఈ హీరోయిన్ చేస్తుందని అంత భావించారు. కానీ బాలీవుడ్ కే పూర్తిగా పరిమితమైంది. అదే సమయంలో బాలీవుడ్ లో అప్పుడప్పుడే హీరోగా మంచి గుర్తింపు దక్కించుకుంటున్న ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. వారిద్దరి ప్రేమకు ఇరువురి కుటుంబ పెద్దలు ఓకే చెప్పడంతో పెళ్లి కూడా జరిగిపోయింది.

పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయిన ఆ హీరోయిన్ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తానంటూ మీడియా ముందు హడావుడి చేస్తుంది. సోషల్ మీడియాలో తన హాట్‌ ఫోటోలను షేర్ చేస్తూ హీరోయిన్ కి నేనేం తక్కువ అన్నట్లుగా మీడియాకు సవాల్ విసురుతుంది. బాగానే ఉంది చూడడానికి హీరోయిన్ గా వర్కౌట్ అవుతుందేమో అని ఇద్దరు ముగ్గురు నిర్మాతలు మరియు దర్శకులు ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించారట. కానీ ఆమె కథ వినకుండానే తన పారితోషికం చెప్పడంతో నీకు దండం బాబోయ్ అంటూ వెళ్లొచ్చారట. ఇద్దరు పిల్లల తల్లి ఆంటీ అయిన ఆమె ఏకంగా కోటిన్నర నుండి రెండు కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తుందట.

senior heroine demanding big remuneration for her re entry

senior heroine demanding big remuneration for her re entry

కథ, పాత్ర ప్రాముఖ్యత ను మరియు షూటింగ్ డేట్స్ ని బట్టి తన రెమ్యూనరేషన్ ఉంటుందంటూ ముందే నిర్మాతలకు చెప్పేస్తుందట. కోటికి పైగా రెమ్యూనరేషన్ ఇస్తేనే సినిమాకు సైన్ చేస్తానంటూ ఆ హీరోయిన్ చెప్పడంతో ఇద్దరు ముగ్గురు ఆమెతో కనీసం స్టోరీ సిట్టింగ్స్ కూడా కాకుండానే వెను తిరిగి వచ్చేసారట. స్టార్ హీరోలకు ఆమె వాంటెడ్ కాదు.. చిన్న హీరోలతో ఆమె సెట్ కాదు.. ఏదో మీడియం రేంజ్ సినిమాలలో ఆమెను నటింప చేద్దాం అనుకొని ఆమెను సంప్రదిస్తే ఇలా కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేసి నిర్మాతలను భయపెట్టిందంట ఆ ఆంటీ సారీ హీరోయిన్. సినిమాలు మానేసి 10 సంవత్సరాలు దాటిన ఆమెకు కోట్ల పారితోషికం ఇవ్వడానికి ఆమె ఏం చిరంజీవి కాదు కదా.. అందుకే ఆమె మళ్ళీ ఇండస్ట్రీలో బిజీ అవ్వడం కష్టమే. ఒకవేళ తన పారితోషికాన్ని సగానికి సగం తగ్గించుకొని నటించేందుకు ఓకే చెప్తే అప్పుడు ఏమైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది