Shanmukh : ఛీ ఛీ ఛండాలం.. దుప్పట్లో దూరిన సిరి, షణ్ముఖ్.. ఒకరినొకరు..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 2, 2021, 10:20 am

Shanmukh : బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 5 చివరి దశకు వచ్చేస్తుంది. షోలో ప్రతిష్టాత్మకమైన ‘టికెట్‌ టు ఫినాలే’ టాస్క్‌ నిన్న మొదలైంది. బిగ్ బాస్ ఫస్ట్ లెవల్‌లో భాగంగా 88వ రోజు ఇంటి సభ్యులకు ఐస్‌ వాటర్‌ టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్ ఆదేశాల మేరకు ఇంటి సభ్యులంతా టాస్క్ లో భాగంగా ఐస్ క్యూబ్స్ తో నిండి ఉన్న టబ్ లో కాళ్లు పెట్టి, పక్కనే ఉన్న బకెట్ లోని బంతులు కాపాడుకోవాలని చెప్పారు. గేమ్ లో ఉంటూనే పక్కవారి బకెట్‌ లోని బాల్స్‌ను కింద పడేస్తూ చివరి వరకు ఎవరైతే ఆటలో ఉంటారో వారే విజేతలని ప్రకటించారు.గేమ్ మొదలైన కాసేపటికే సిరి, సన్నీల మధ్య గొడవ స్టార్ట్ అయింది. సన్నీ బకెట్ అలా కాలు కిందికి పెట్టాడో లేడో..

సిరి వచ్చి బాల్స్ అన్ని కింద పడేసింది. నన్ను కావాలనే సిరి టార్గెట్‌ చేసి బ్యాడ్‌ గా కనిపించేలా చేస్తోందంటూ సన్ని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిరి మాదిరిగానే సన్ని కూడా ఆమె ఆట ను చెడగొట్టాలని ప్రయత్నించాడు సన్ని. అప్రమత్తమైన సిరి… ఓ వైపు ఆటపై ఫోకస్ పెడుతూనే తన బాల్స్ ను కాపాడుకుంది. ఇక తన వల్ల కాలేక ఎలిమినేట్అయిన తన ఫ్రెండ్ రవిని గుర్తు చేసుకుంటూ.. ఐ మిస్‌ యూ అంటూ ఏడ్చేసింది. మరోవైపు షణ్ముఖ్ Shanmukh సైతం నీకోసం ఆడుతున్నా రవి అంటూ బాధలో ఉన్నట్లు అరిచాడు. టాస్క్‌లో సన్నీ 59 బాల్స్‌తో లీడింగ్‌లోకి రాగా.. 29 బాల్స్‌లో లీస్ట్‌లో ఉండి పోయింది ప్రియాంక.

Biig Boss 5 telugu seasonvoting list

Biig Boss 5 telugu seasonvoting list

Shanmukh : దుప్పట్లోకి దూరి మరి… ఒకరినొకరు:

ఏడుస్తున్న సిరిని ఒదార్చడానికి వచ్చిన షన్ను.. ఆమె దుప్పట్లో దూరాడు. ఇద్దరూ కలిసి ఒకర్నొకరు ఓదార్చుకున్నారు. షణ్ముఖ్ Shanmukh పై పడుకుని అతడిని హాగ్ చేసుకుంటూ సిరి వెక్కి వెక్కి ఏడ్చింది. అయితే ఇదంతా చూసే హౌస్ సభ్యులకే కాక.. ప్రేక్షకులకు కూడా కాస్త వెగటు పుట్టించే లాగా కనిపించిది. ఈ డ్రామా అంత గమనిస్తూ వస్తున్న సన్నీ, కాజల్, మానస్‌ లు… రవిని నామినేట్ చేసి బయటకు పంపేసి.. ఇప్పుడు రవి రవి అని అరుస్తున్నారేంట్రా వీళ్లు అని జుట్టు పీక్కున్నారు. డ్రామాలు ఆడుతూ తెలివిగా కావాలనే పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారంటూ సన్ని ఫైర్ అయ్యాడు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp