Shanmukh : సిరికి అది లేదు.. పరువుతీసిన షన్ను
Shanmukh : బిగ్ బాస్ ఇంట్లో సండే ఫండేగానే గడిచింది. కంటెస్టెంట్లతో నాగార్జున ఆటలు ఆడించాడు. పాటలు పాడించాడు. బొమ్మలతో కంటెస్టెంట్లను పోల్చమన్నాడు.లూడో గేమ్ ఆడించాడు. అలా మొత్తానికి ఇంటి సభ్యులను ఎంటర్టైన్ చేయడమే కాకుండా.. ప్రేక్షకులను కూడా అలరించాడు. లూడో గేమ్ కోసం సిరి షన్ను, కాజల్ సన్నీ, మానస్ ప్రియాంకలను ఓ జోడిగా పెట్టాడు.
ఇందులో షన్ను, మానస్, సన్నీలు డైస్ థ్రో చేశారు. సిరి, ప్రియాంక, కాజల్‌లు వాటికి తగ్గట్టుగా ఆటలు ఆడారు. రెడ్ బాక్స్‌లోకి వస్తే.. పనిష్మెంట్.. బ్లూ వస్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.. గ్రీన్ వస్తే సేఫ్ అన్నట్టుగా చెప్పేశాడు. అయితే షన్ను వేసినప్పుడల్లా సిరి బ్లూ బాక్సులోకి వచ్చింది. అలా నాగార్జున ప్రశ్నలు వేయడంతో షన్ను ఇరుక్కుపోయాడు.

Shanmukh Humiliates Siri In Bigg Boss 5 telugu 13th week
Shanmukh సిరికి కామన్ సెన్స్ లేదట..
టాప్ 5లో ఉండేందుకు అర్హత లేని వారు ఎవరు? అని ప్రశ్న వేశాడు. దీనికి షన్నునే సమాధానం చెబుతాడు అని సిరి ఇరికించేసింది. షన్ను కాస్త ఆలోచించి ఏం చెప్పాలో తెలియక.. కాజల్ పేరును చెప్పేశాడు. ఇక మరోప్రశ్నకు గాను సిరి పరువుతీసేశాడు షన్ను. ఇంట్లో కామన్ సెన్స్ తక్కువ ఉన్నవాళ్లు, లేని వాళ్లు ఎవరో చెప్పమని షన్నుని ప్రశ్నించాడు నాగార్జున. సిరి, ప్రియాంకకు కామన్ సెన్స్ లేదని, సిరికి అస్సలే లేదని షన్ను పరువుతీసేశాడు.
#Nagarjuna imitating #Kajal ????… #Sunny is funny in make up#BiggBossTelugu5 today at 9 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/bBnJqvWmhx
— starmaa (@StarMaa) December 5, 2021