Bigg Boss 5 Telugu : చెప్పు తీసుకుని కొడుతుంది.. దీప్తి సునయనపై షన్ను కామెంట్స్
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో దీప్తి సునయన పేరు పదే పదే వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే షన్ను ఎక్కువగా దీప్తి సునయన పేరు వాడుతుంటాడు. సిరితో ఉన్న సమయాల్లో ఎక్కువగా దీప్తి నామస్మరణ చేస్తుంటాడు. అలాంటి షన్ను నిన్న ఓ ఘటనలో తెగ హర్ట్ అయ్యాడు. సిరిని నానా రకాలు మాటలు అనేశాడు. దీంతో సిరి కూడా కాస్త హర్ట్ అయింది. ఆ గొడవ ఎందుకు మొదలైంది.. ఎలా మొదలైంది అనే విషయాలు సరిగ్గా చూపించలేదు. కానీ సిరి మీద షన్ను అలిగాడు.

Shanmukh Jaswanth On Deepthi Sunain Before Siri
ఎవరైనా పక్కన వాళ్లు జోకులు, సెటైర్లు వేస్తే.. నువ్ కూడా దూరుతావ్.. ఇంకా ఎక్కువ చేస్తావ్ అంటూ సిరి గురించి షన్ను అన్నాడు. నేను ఎప్పుడు అలా చేశాను అని సిరి అంటుంది. నువ్ ఎప్పుడూ అలానే చేస్తావ్ అని షన్ను అంటాడు. నువ్ కూడా నా మీద ఎప్పుడూ అందరి ముందే జోకులు వేస్తావ్ కదా? అని సిరి అంటుంది. నీకు ఇష్టం లేకపోతే చెప్పు..అలా జోకులు వేయడం ఇష్టం లేదని చెప్పు.. నేను వేయను. అయినా అందరూ వేసే జోకులను నువ్ తీసుకుంటావే. ఆ అలవాటు నీకుందేమో కానీ నేను తీసుకోలేను అని షన్ను అంటాడు.
Bigg Boss 5 Telugu : రితో షన్ను గొడవ

Shanmukh Jaswanth On Deepthi Sunain Before Siri
సరే ఇకపై నీ మీద జోకులు వేయను అని సిరి అంటుంది. హా వేయోద్దు. ఎవ్వరైనా నా మీద జోకులు వేస్తే.. ఇది ఉంటే చెప్పు తీసుకుని కొడుతుంది అని దీప్తి పేరున్న టాటూను షన్ను చూపిస్తాడు. మొత్తానికి షన్ను మీద మాట కూడా పడనివ్వకుండా దీప్తీ సునయన అంత బాగా చూసుకుంటుందని చెప్పకనే చెప్పేశాడు. అలా దీప్తి సునయన షన్ను ట్రాక్ రోజూ ఒక టాపిక్‌తో జనాల్లో నానుతోంది. లోపల షన్ను.,. బయట దీప్తి మొత్తానికి సరిపోయారు.
View this post on Instagram