Shanmukh : మళ్లీ అక్కడికే వచ్చిన షణ్ముక్ .. అదే ముఖ్యమని కామెంట్స్..

Advertisement

Shanmukh : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్.. ఆదివారం నాటి ఎపిసోడ్‌తో ముగిసింది. గ్రాండ్ ఫినాలే విజేతగా ఖమ్మం కుర్రాడు వీజే సన్నీ నిలిచాడు. చాలా మంది యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ విజేతగా నిలుస్తాడని అనుకున్నారు. కానీ, చివరి క్షణాల్లో షణ్ముక్ ను పక్కకు నెట్టేసి వీజే సన్నీ విజేతగా అవతరించాడు. ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ టైటిల్ తో పాటు రూ.50 లక్షల ప్రైజ్ మనీ., రూ.25 లక్షల విలువైన ఫ్లాట్, బైక్ గెలుచుకున్నాడు. ఈ సంగతులు అలా ఉంచితే.. బిగ్ బాస్ రన్నర్‌గా నిలిచిన సందర్భంగా షణ్ముక్ జస్వంత్ చేసిన కామెంట్స్ ప్రజెంట్ చర్చనీయాంశమవుతున్నాయి.

నిజానికి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టైటిల్ షణ్ముక్  గెలుచుకునే వాడని, కానీ, అతడి ప్రవర్తన వల్లే టైటిల్ చేజారిందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తనకు దీప్తి సునయిన అనే గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పటికీ షణ్ముక్.. సిరితో ఫ్రెండ్ షిప్ ముసుగులో రొమాన్స్ చేశాడని కొందరు ఆరోపిస్తున్నారు. ఫ్రెండ్లీ హగ్స్, బెడ్ పైన పక్క పక్కనే పడుకోవడం వంటివి షణ్ముక్ కు మైనస్ అయ్యాయని అంటున్నారు.అటువంటి పనులు చేయడం వల్లే షణ్ముక్ టైటిల్ దగ్గరి దాకా వచ్చి మిస్సయ్యాడని పేర్కొంటున్నారు. ఈ సంగతులు అలా ఉంచితే..

Advertisement
shanmukh speech on runner of game show Bigg Boss 5 Telugu 
shanmukh speech on runner of game show Bigg Boss 5 Telugu

Shanmukh : వంకర బుద్ధి చూపించిన షణ్ముక్..!

షణ్ముక్ జస్వంత్ రన్నరప్‌గా నిలిచిన సందర్భంలో ఇచ్చిన స్పీచ్‌పైన డిస్కషన్ జరుగుతోంది. సన్నీ టైటిల్ విన్ అయిన తర్వాత షణ్ముక్‌ను అప్యాయంగా హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే రన్నర్ షణ్ముక్ మాట్లాడాలని నాగార్జున కోరాడు. అప్పుడు షణ్ముక్ మాట్లాడుతూ విన్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.. ఆట ఎలా ఆడాం అన్నదే ఇంపార్టెంట్ అని అన్నాడు. తాను ఇక్కడి వరకు వచ్చినందకు ఆనందంగా ఉన్నానని, అమ్మా నాన్న ఇక్కడకు వచ్చారని అందుకు చాలా హ్యాపీగా ఉందని షణ్ముక్ తెలిపాడు.

Advertisement
Advertisement