Bigg Boss Telugu 7 : ప్రిన్స్ యావర్‌ను పిచ్చోడిని చేసిన ప్రియాంక, శోభాశెట్టి.. కోపంతో యావర్ ఏం చేశాడో చూడండి | The Telugu News

Bigg Boss Telugu 7 : ప్రిన్స్ యావర్‌ను పిచ్చోడిని చేసిన ప్రియాంక, శోభాశెట్టి.. కోపంతో యావర్ ఏం చేశాడో చూడండి

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మామూలుగా లేదు. ఉల్టా పుల్టా అంటే ఇదే కావచ్చు. ఓ రేంజ్ లో ఉంది ఈ సీజన్. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయి మూడు వారాలు అవుతోంది. కానీ.. ఇప్పటి వరకు ఇంటి సభ్యులుగా కన్ఫమ్ అయింది ఇద్దరే ఇద్దరు. ఒకరు ఆట సందీప్, మరొకరు శివాజీ. ఈ ఇద్దరు మాత్రమే ఇప్పుడు హౌస్ మెట్స్. ఇక మూడో హౌస్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :22 September 2023,1:00 pm

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మామూలుగా లేదు. ఉల్టా పుల్టా అంటే ఇదే కావచ్చు. ఓ రేంజ్ లో ఉంది ఈ సీజన్. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయి మూడు వారాలు అవుతోంది. కానీ.. ఇప్పటి వరకు ఇంటి సభ్యులుగా కన్ఫమ్ అయింది ఇద్దరే ఇద్దరు. ఒకరు ఆట సందీప్, మరొకరు శివాజీ. ఈ ఇద్దరు మాత్రమే ఇప్పుడు హౌస్ మెట్స్. ఇక మూడో హౌస్ మెట్ కోసం పోటీ జరుగుతుండగా ఆ పోటీలో ముగ్గురు నిలిచారు. యావర్, శోభా శెట్టి, ప్రియాంక.. ఈ ముగ్గురిలో ఒకరు మూడో ఇంటి సభ్యుడిగా కన్ఫమ్ అవుతారు. కానీ.. ఇక్కడే ఈ ముగ్గురికీ బిగ్ బాస్ ఫిట్టింగ్ పెట్టాడు.

shobha and priyanka plan to eliminate yawar from contender race

#image_title

ఈ ముగ్గురిలో ఒకరు కంటెండర్ గా అర్హులు కాదు అంటే.. ఇద్దరు కంటెండర్స్ కలిసి ఒక కంటెండర్ ను పక్కకు తప్పించాలని చెబుతాడు. దీంతో శోభా శెట్టి, ప్రియాంక జైన్ ఇద్దరూ కలిసి యావర్ ను తప్పిస్తున్నట్టుగా చెబుతారు. దీంతో యావర్ కు చాలా కోపం వస్తుంది. శోభా శెట్టి, ప్రియాంక ఇద్దరూ ఒకే బ్యాచ్ కాబట్టి ఇద్దరూ కలిసి యావర్ ను పక్కకు తప్పించడంతో యావర్ కు చాలా కోపం వస్తుంది. ప్రియాంకను వేడుకున్నా కూడా అస్సలు వినదు ప్రియాంక. నేను లేడీ. నీతో నేను ఫిజికల్ టాస్క్ లో ఆడలేను అంటూ చెబుతుంది శోభా శెట్టి.

Bigg Boss Telugu 7 : లేడీ అయితే మీరు నన్ను ఎలిమినేట్ చేస్తారా?

ప్రియాంకను కూడా యావర్ వేడుకుంటాడు. కానీ.. ప్రియాంక, శోభా శెట్టి ఇద్దరూ కలిసి యావర్ ను పక్కకు తప్పించేస్తారు. దీంతో యావర్ కు చాలా కోపం వస్తుంది. ఇద్దరిని ఎంత వేడుకున్నా పట్టించుకోకుండా ప్రియాంక జైన్ అయితే యావర్ పై సీరియస్ అవుతుంది. ఎందుకు అరుస్తున్నావు.. చేయి దించు అంటూ మాట్లాడుతుంది. దీంతో కోపంతో బల్ల మీద ఉన్న తన ఫోటోను తానే వెళ్లి బలంగా కొడతాడు. ఏంటి నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఏంటి అంటూ సందీప్ కూడా యావర్ పై సీరియస్ అవుతాడు. దానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదలైంది.

kranthi

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...