Bigg Boss Telugu 7 : ఇమ్యూనిటీ టాస్క్‌లో బుల్ మీదికి ఎక్కి చేయి విరగ్గొట్టుకున్న శోభా శెట్టి.. హౌస్ నుంచి నేరుగా హాస్పిటల్‌కి తరలింపు?
Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మంచి జోరు మీదుంది. డే వన్ నుంచి మూడు వార్తలు పూర్తి కావస్తున్నాయి.. ఇప్పటి వరకు కూడా బిగ్ బాస్ హౌస్ లో బీభత్సమైన ఎంటర్ టైన్ మెంట్ దొరుకుతోంది ప్రేక్షకులకు. ఏ సీజన్ లో కూడా ఈ రేంజ్ ఎంటర్ టైన్ మెంట్ దొరకలేదు. అది కేవలం బిగ్ బాస్ సీజన్ 7 వల్లనే సాధ్యం అయింది. దానికి కారణం ఈ […]
Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మంచి జోరు మీదుంది. డే వన్ నుంచి మూడు వార్తలు పూర్తి కావస్తున్నాయి.. ఇప్పటి వరకు కూడా బిగ్ బాస్ హౌస్ లో బీభత్సమైన ఎంటర్ టైన్ మెంట్ దొరుకుతోంది ప్రేక్షకులకు. ఏ సీజన్ లో కూడా ఈ రేంజ్ ఎంటర్ టైన్ మెంట్ దొరకలేదు. అది కేవలం బిగ్ బాస్ సీజన్ 7 వల్లనే సాధ్యం అయింది. దానికి కారణం ఈ సీజన్ ఉల్టా పుల్టా కావడం. బిగ్ బాస్ చెప్పినట్టుగానే అసలు ఈసారి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. ఏ క్షణం బిగ్ బాస్ ఎలాంటి టాస్క్ ఇస్తారో కూడా తెలియడం లేదు.
ఇక.. మూడో పవరాస్త్ర కోసం జరుగుతున్న పోటీలో చివరి ఇద్దరు కంటెండర్లుగా శోభా శెట్టి, ప్రియాంక జైన్ మిగిలిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరిలో ఒకరు మూడో హౌస్ మెట్ కూడా అవుతారు. మూడో హౌస్ మెట్ కోసం ప్రియాంక, శోభాశెట్టి ఇద్దరి మధ్య పోటీ పెడతాడు బిగ్ బాస్. ప్రిన్స్ యావర్ ను పక్కకు తప్పించి ఇద్దరు లేడీ కంటెస్టెంట్లు బరిలోకి దిగుతారు. అయితే.. అది బుల్ మీద ఎక్కి కూర్చోవాలి. అది ఊగుతూ ఉంటుంది. ఎవరు ముందు కిందపడితే వాళ్లు ఔట్ అన్నట్టు.
Bigg Boss Telugu 7 : బుల్ మీది నుంచి కింద పడుతూ చేయి విరగ్గొట్టుకున్న శోభా శెట్టి
ఈ టాస్క్ లో భాగంగా శోభా శెట్టి, ప్రియాంకా జైన్ ఇద్దరూ బుల్ ఎక్కుతారు. ప్రియాంక గట్టిగా బుల్ ను పట్టుకుంటుంది కానీ.. శోభా శెట్టి చాలా సేపు బుల్ మీద ఉండలేకపోతుంది. కింద పడిపోయేసరికి చేయి విరుగుతుంది. దీంతో వెంటనే హౌస్ లో ఉన్న డాక్టర్ గౌతమ్ కృష్ణ తన చేయిని టెస్ట్ చేస్తాడు కానీ.. తనకు తగ్గదు. దీంతో బిగ్ బాస్ కి చెబుతాడు. మరి.. బిగ్ బాస్ సూచన మేరకు శోభాశెట్టిని హాస్పిటల్ కి తీసుకెళ్తారా.. ఏం జరుగుతుందో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ ప్రసారం అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే.