Shriya Saran : భర్త గొంతు పిసికేస్తోన్న శ్రియా.. కాపాడంటూ అరిచిన ఆండ్రూ
Shriya Saran : హీరోయిన్ శ్రియా, ఆమె భర్త ఆండ్రూ కొశ్చివ్ సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటారో అందరికీ తెలిసిందే. ఎవ్వరికీ తెలియకుండా, అనుమానం రాకుండా అలా లాక్డౌన్‌లో బిడ్డను కనేశారు. సడెన్‌గా బిడ్డను చూపించడంతో అంతా షాక్ అయ్యారు. గత ఏడాది లాక్డౌన్‌లోనే బిడ్డ పుట్టిందని, ఆమెకు పేరు కూడా పెట్టామని, రాధ అంటూ ప్రకటించింది ఈ జోడి. దీంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అలా మొత్తానికి శ్రియ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Shriya Saran Fun With andrei koscheev
ఇక ఆమె ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. భర్తతో అందరి ముందే సరసాలు ఆడటం, ముద్దులాటల్లో తేలడం, నడి రోడ్డు మీద కూడా సరసాలు ఆడుతూ ఉంటారు. శ్రియ, ఆండ్రూ చేసే రచ్చ సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ ఇద్దరూ లిప్ లాక్, మితిమిరీ చేసే ముద్దులాటలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారతుంటాయి. మొన్నటికి మొన్న ఈ ఇద్దరూ జీ తెలుగు కుటుంబం అవార్డుల కార్యక్రమంలో అందరినీ షాక్‌కు గురి చేశారు.
Shriya Saran : శ్రియా, ఆండ్రూ సరసాలు..

Shriya Saran Fun With andrei koscheev
స్టేజ్ మీద అందరి ముందు లిప్ లాక్ చేసేశారు. అయితే తాజాగా శ్రియ తన భర్త ఆండ్రూని హింసించేసింది. పీక పట్టుకుని పిసికేసింది. దీంతో ఆండ్రూ ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. నన్ను కాపాడండి అని అరిచాడు. మొత్తానికి ఈ ఇద్దరూ బెడ్డు మీద ఆడే ఆటలు మామూలుగా లేవు. మొత్తానికి శ్రియా పర్సనల్ లైఫ్‌లో ఫుల్ ఖుషీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక సినీ కెరీర్ కూడా బాగానేఉంది. నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంటూ వస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో శ్రియా ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతోంది.