Shriya Saran : అందరూ చూస్తుండగానే రెచ్చిపోయిన శ్రియ.. అతడికి లిప్ లాక్.. ఆశ్చర్యంలో అతిథులు..
Shriya Saran : సీనియర్ హీరోయిన్ శ్రియా సరన్ సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ మామూలుగా ఉండదన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్‌గా దాదాపుగా యాక్ట్ చేసింది. తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ – జీనియస్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘శివాజీ’లో హీరోయిన్‌గా శ్రియ నటించింది. ఇకపోతే ఈ భామ చాలా కాలం పాటు రష్యన్ బిజినస్ మ్యాన్ ఆండ్రీ కోషీవ్‌తో ప్రేమాయణం జరిపిందట. అయితే, 2018లో మాత్రం సడెన్‌గా అతడిని పెళ్లాడింది.
Shriya Saran : స్టేజీ మీదనే ముద్దులు.. షాక్ అయిన యాంకర్, గెస్టులు..
వీరికి ఒక పాప పుట్టినట్లు ఇటీవల శ్రియ ప్రకటించింది. తాజాగా సోషల్ మీడియాలో శ్రియా దంపతుల వీడియో ఒకటి వైరలవుతోంది. శ్రియా సరన్ తన భర్త ఆండ్రీ కోషీవ్‌తో కలిసి టూర్స్ ప్లాన్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ముద్దులు పెడుతున్న, ఎద అందాలను తాకుతున్న ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంటుంది. తాజాగా జీ తెలుగు చానల్ వారు నిర్వహించిన కుటుంబం అవార్డ్స్ ఈవెంట్‌లో శ్రియ దంపతులు హాజరయ్యారు. అక్కడ కూడా వీరు రెచ్చిపోయారు. మొదటి సారి భర్తతో ఈవెంట్‌కు వచ్చిన శ్రియకు వెల్ కమ్ చెప్పగా, స్టేజీ పైన నిలబడి శ్రియ హస్బెండ్ ఆండ్రీ అందరికీ నమస్కారం అని చెప్పాడు.
ఈ క్రమంలోనే మీరు సోషల్ మీడియాలో ఎటువంటి ఫోజులు కొడతారని యాంకర్ ప్రదీప్ అడగగా, వెంటనే శ్రియ బుగ్గ మీద ఆండ్రీ ముద్దు పెట్టాడు. అంతటితో ఆగిపోతే సరిపోయేది. కానీ, శ్రియా ఏ మాత్రం ఆగలేదు. అందరూ చూస్తుండగానే తన భర్తకు ఏకంగా లిప్ లాక్ ఇచ్చేసింది. అతిథులు, యాంకర్ ప్రదీప్ ఈ దృశ్యాలను ఒక్కసారి లైవ్‌గా చూసి షాకయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరలవుతోంది.